
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని వివరించారు. రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.