
ఉద్యోగ నియామక పత్రాల అందజేత
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్ మేళాలో ఉద్యోగావకాశాలు పొందిన 76 మందికి ఆర్‌ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. అరండల్‌పేటలోని రైల్ మహల్‌లో శనివారం 16వ రోజ్‌గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు, సికింద్రాబాద్, గుంతకల్ సహా 47 ప్రదేశాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేళాను ప్రారంభించారు. ఇందులో భాగంగా 76 మందికి డీఆర్‌ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎస్‌టీఈ రత్నాకర్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్‌లో 76 మందికి పంపిణీ