
గుంటూరు
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
చేబ్రోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చేబ్రోలులోని పరిమి సత్యనారాయణ కల్యాణ మండపంలో శనివారం వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించిన సమావేశానికి పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి మోసగించిందని ఆరోపించారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అంటూ మొదలు పెట్టారని, అది మోసపూరిత పాలను తొలి అడుగు అని విమర్శించారు. కార్యక్రమంలో చేబ్రోలు, పొన్నూరు ఎంపీపీలు కొక్కిలగడ్డ సాహితి, భవనం పద్మలీల, పెదకాకాని జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు పార్టీ మండల అధ్యక్షులు ఆళ్ల శ్రీరామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నాయకులు ఎన్. రూత్‌రాణి, ఆకుల వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ నాజర్, యందేటి వెంకటసుబ్బయ్య, తాటిబోయిన వేణుగోపాల్, చందు సాంబశివరావు, బీమవరపు విజయలక్ష్మి, పోలేశ్వరరావు, చేబ్రోలు నాగేశ్వరరావు, అల్లం వెంకట్రామయ్య, దంతాల శ్రీనివాసరావు, వెలగా కృష్ణ, కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
7
న్యూస్‌రీల్
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజం చేబ్రోలులో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
సీట్ల వివరాలు
గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి.
రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు