
సుపరిపాలన కాదు.. రుబాబు పాలన
పక్కా ప్లాన్ ప్రకారం దాడి
పీఎం సూర్యఘర్‌పై విస్తృత ప్రచారం
కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి సూర్య ఘర్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవనం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాలులో ఇంజినీరింగ్ సిబ్బంది, ఉద్యోగులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ లోవోల్టేజ్ సమస్యలను అధిగమించి, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలని ఆయన సూచించారు. బకాయిలపై దృష్టి పెట్టాలని, ఆర్‌డీఎస్‌ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, రైతులకు త్వరితగతిన ఇవ్వాలని సూచించారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహించినా, ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సీజీఎం రాందాస్, గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్. రమేష్, డివిజనల్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
రేపటిలోగా ఫిర్యాదులుపరిష్కరించుకోవాలి
డీఏఓ అయితా నాగేశ్వరరావు
కొరిటెపాడు(గుంటూరు): అన్నదాత సుఖీభవ ఫిర్యాదులను రైతులు ఈనెల 13వ తేదీలోపు పరిష్కరించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)అయితా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి సెలవు రోజుల్లో (12, 13వ తేదీల్లో) కూడా అందుబాటులో ఉండాలని ఆర్‌ఎస్‌కేల సిబ్బందిని ఆయన ఆదేశించారు.
నేడు నృసింహస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ
మంగళగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నట్లు ఈవో సునీల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కొప్పురావూరి లక్ష్మీశ్రీనివాసరావు దంపతులు వ్యవహరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
సమన్వయంతో ఫ్లై ఓవర్ పనులు
కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ నూతన ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సమన్వయంతో వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించుకోవాలన్నారు. ఇప్పటికి ఆక్రమణలు తొలగించిన వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు తదితర వ్యాపారులు సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్లే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులను ఏర్పాటు చేయాలన్నారు. ఫ్‌లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన స్థానిక పెద్దలతో, వ్యాపారస్తులతో నిరంతరం చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, జీఎంసీ ఎస్‌ఈ శివనాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సర్వేలోగుంటూరుకు ప్రథమ స్థానం
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్) పారిశుద్ధ్య సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలో తొలి స్థానంలో నిలవడం అభినందయనీయమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐవీఆర్‌ఎస్ బృందం పారిశుద్ధ్య పనులకు సంబంధించి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ప్రజాభిప్రాయ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ 67 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటి నుండి చెత్త సేకరిస్తున్నారా, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలను 24 గంటల్లోగా తొలగిస్తున్నారా, లేదా, మీ మునిసిపాలిటీలో డ్రైన్లను శుభ్రం చేస్తున్నారా లేదా అనే మూడు అంశాలపై ఐవీఆర్‌ఎస్ బృందం చేసిన సర్వేలో గుంటూరు నగర ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపిన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో గుంటూరు నగరపాలక సంస్థ ప్రథమ స్థానంలో నిలవడం అనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరానికి మంచి పేరు తెచ్చిన ప్రజారోగ్య కార్మికులు, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.
గురజాల తహసీల్దార్ సస్పెన్షన్
గురజాల: మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న వైవీ కుటుంబ రావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ రావు గతంలో దాచేపల్లి మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన సమయంలో కేసానుపల్లి, పెదగార్లపాడు, భట్రుపాలెం, గామాలపాడు గ్రామాల్లో ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ మాసంలో దాచేపల్లి మండలం నుంచి ఆయన గురజాలకు బదిలీపై వచ్చారు.
పట్నంబజారు: రాష్ట్రంలో దుష్టపాలన సాగిస్తూ ... సుపరిపాలన అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో శుక్రవారం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాలు స్కానర్‌లకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని విమర్శించారు. మిత్రపక్షమైన బీజేపీ కనీసం మేనిఫెస్టో కూడా పట్టుకోని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 11 సీట్లు రావడంపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లల్లోకి వెళ్లి దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడిన పరిస్థితులు దారుణమని ఖండించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం కేసులు పెట్టి జైలుకు పంపారని మండి పడ్డారు. 1989 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి నీచ పాలన ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటున్నారని, అసలు ఏం అఘోరించావు చంద్రబాబు ? అని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్ సీపీ పోరాటంతోనే తల్లికి వందనం పడిందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఆఖరికి అమ్మ ఒడి సైతం తన కుమారుడు ఆలోచనేనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డిని మోసం చేశామని బాధపడుతున్నారని తెలిపారు. సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేసి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై ప్రతి ఒక్క కార్యకర్త కచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నిజమైన వైఎస్సార్ సీపీ కార్యకర్త టీవీ ప్రసారాలు ఎందుకు రావడం లేదంటూ కేబుల్ ఆపరేటర్‌ను నిలదీయాలని చెప్పారు. సాక్షి వీక్షకుల సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
కూటమి పాలనపై వ్యతిరేకత
ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయాన అబద్ధాలు చెప్పి గెలుపు తరువాత కనీసం గడప వైపు కూడా కూటమి ప్రభుత్వం చూడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ఒకే ఒక్క పేజీలో ప్రజలకు అందుబాటులో కనిపించేలా ఉంచిందని, దాన్ని పవిత్ర గ్రంథంలా చూసిందని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూటమిపై స్పష్టమైన వ్యతిరేకత కనబడుతోందని పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు అందని పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు. ఏడాదిలో విఫలమైన ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోటని, అక్కడ ఓడిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పార్టీని అఖండ మెజా ర్టీతో గెలిపించుకోవాలని, నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాను అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, అనుబంధ విభాగాల అధ్యక్షులు వాసిమళ్ల విజయ్, గనిక ఝాన్సీరాణి, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే నాగమల్లేశ్వరరావును హత్య చేసేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. గతంలో సైతం ఆయన సోదరుడిపై వెంటపడి మరి దాడి చేసి గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అసలు పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన పట్టు కోసం హత్యా రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఖండించారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో నరేంద్రపై కేసు నమోదు చేయాలని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి అని మండిపడ్డారు. బాధితుడికి అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర నీచ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, షేక్ మస్తాన్ వలి, నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి, న్యాయవాది బ్రహ్మారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: ప్రియునితో కలిసి భర్తను హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితురాలు వినుకొండకు చెందిన శ్రీగిరి స్వాతి, ఆమె ప్రియుడు పట్టేపురం మారుతీబాబులకు జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు.. శ్రీగిరి కుమార్ (38)తో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామానికి చెందిన స్వాతికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. స్వాతికి వినుకొండకు చెందిన పట్టేపురం అలియాస్ రాజారపు మారుతీబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 11వ తేదీన కుమార్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా స్వాతి, మారుతీబాబు కలిసి కుమార్ మెడకు తాడు బిగించి హతమార్చారు. కుమార్ తల్లి మేరీ రోజ్లిన్ దీనిపై వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూస్‌రీల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
భర్తను హతమార్చిన భార్యకు జీవిత ఖైదు
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఎండీ పుల్లారెడ్డి
మోసానికి నిలువెత్తు రూపం బాబు
గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ నిజమనే మాటకు నిలువెత్తు రూపం ఉందంటే అది వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని, అబద్ధానికి అద్దం పడితే అది చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజలకు చంద్రబాబు ఊసరవెల్లి మాటలను తెలియజెప్పాలని, అందుకే ఇటువంటి గొప్ప కార్యక్రమానికి జగనన్న శ్రీకారం చుట్టారని వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని ప్రజల గడప వద్దకు చేరిస్తే, జగనన్న నేరుగా ఇంటి లోపలకు తీసుకెళ్లారని చెప్పారు. పొదిలిలో పొగాకు రైతులు, బంగారుపాళెంలో మామిడి రైతులు, గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వస్తే వందలాది మంది పోలీసులతో ఆంక్షలు పెట్టి ఆపుదామనుకుంటే అది అసంభవం అనే విషయం గుర్తించాలని హితవు పలికారు. నిజం వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల పక్షాన గొంతుకై నిలిచిన సాక్షి పక్షాన అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూటమి నేతలు వెళ్లలేని దుస్థితి దాపురించిందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

సుపరిపాలన కాదు.. రుబాబు పాలన

సుపరిపాలన కాదు.. రుబాబు పాలన

సుపరిపాలన కాదు.. రుబాబు పాలన

సుపరిపాలన కాదు.. రుబాబు పాలన