కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు చేయాలి

Jul 12 2025 9:37 AM | Updated on Jul 12 2025 9:37 AM

కొనుగోలు చేయాలి

కొనుగోలు చేయాలి

రైతుల నుంచి మొత్తం పొగాకు

లక్ష్మీపురం: జిల్లాలో రైతుల నుంచి మొత్తం నల్లబర్లీ పొగాకును గిట్టుబాటు ధరకు కొనగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్‌ చేశారు. నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని తెలిపారు. గుంటూరు చుట్టగుంట సెంటర్‌లోని మార్కెట్‌ యార్డులో శుక్రవారం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్లపాడు, కండ్రిక, మేరికపూడి గ్రామాల రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకులో తేమ శాతం ఎక్కువగా, నాసిరకంగా ఉందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీ గ్రేడ్‌ కింద 80 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, క్వింటాకు ఆరు వేల రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలిపారు. కండ్రిక గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతు 16 చెక్కులు తీసుకు రాగా, నాసిరకంగా ఉందని 10 తిప్పి పంపేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో రైతు రామయ్య నాలుగు చెక్కులు కొనగోలు కేంద్రానికి తీసుకురాగా రెండు తిప్పి పంపారని చెప్పారు. ఫిరంగిపురం మండలం మేరిక పూడి గ్రామానికి చెందిన రైతు ముక్కంటి 55 చెక్కులు తీసుకు రాగా మొత్తం తెచ్చిన ట్రాక్టర్‌లోనే అధికారులు వెనక్కి పంపారని వివరించారు. ఈ స్థితిలో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదని పేర్క్ననారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంవత్సరం 30వేల టన్నులు ఉత్పత్తి కాగా ఇప్పటికి నాలుగు వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ స్థితిని గమనించి ప్రైవేటు కంపెనీలు గ్రామాలలోనే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు వేగం పెంచాలని, లేనిపక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కృష్ణ పాల్గొన్నారు.

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement