
జిల్లా నెత్తిన అధిక జనాభా కత్తి
గుంటూరు మెడికల్: దేశాభివృద్ధి జనాభాపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే మరికొన్ని లేక ఇబ్బంది పడుతున్నారు. జనాభా పెరుగుదల కోసం ప్రజలకు ఆయా దేశాలు పలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. అయితే, మన దేశంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. జిల్లాలోనూ పెరుగుదల రేటు గణనీయంగా ఉంది. 2001లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 44,65,144 ఉండగా 2011లో 48,87,813 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2021లో జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 2024 నాటికి 52,04,289 మంది ఉండొచ్చని వైద్య అధికారులు అంచనా వేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లా జనాభా 22,26,467 మంది ఉన్నారు. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
గతంలో జనాభా నియంత్రణకు ఆరుసార్లు రాష్ట్ర అవార్డులు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరుసార్లు వరుసగా రాష్ట్ర అవార్డులు అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆధ్వర్యంలో 2009–10లో తొలిసారిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఈ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడిన 50 ఏళ్లలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవార్డు రావడం ఇదే ప్రథమం. నాటి నుంచి వరుసగా 2010–11లో, 2011–12లో, 2012–13లో, 2013–14లో, 2015–16లో వరుసగా అవార్డు పొందింది. ఇప్పటివరకు ఏ జిల్లా కూడా సాధించని డబుల్ హ్యాట్రిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృస్టించింది. తర్వాత ప్రభుత్వం అవార్డులను నిలిపివేసింది. ఆరోగ్య కార్యక్రమాల అమలుకు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నేడు చిట్టచివరన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిలిచింది.
నేడు ప్రపంచ జనాభా దినోత్సం
52లక్షలకు చేరిన జిల్లా జనాభా
ఉచితంగా ఆపరేషన్లు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. పైళ్ళెన వెంటనే గర్భం రాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజలు పాటించేలా వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే సీ్త్రలకు, పురుషులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
జీజీహెచ్‌లో అధికంగా ఆపరేషన్లు
గుంటూరు జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ప్రతినెలా అధిక మొత్తంలో ఆపరేషన్లు చేస్తున్నాం. జిల్లాలో అత్యధికంగా కు.ని. ఆపరేషన్లు చేస్తున్నందుకు ప్రతి ఏడాది జీజీహెచ్ కుటుంబ నియంత్రణ వైద్య విభాగానికి అవార్డును ఇస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చేసిన రోజే ఇంటికి వెళ్లి పోవచ్చు.
– డాక్టర్ యశస్వి రమణ,
సూపరింటెండెంట్
గ్రామాల్లోనే జనాభా అధికం
సంవత్సరం గ్రామీణం పట్టణం
2011 32,35,075 16,52,738
2024 34,44,539 17,59,750

జిల్లా నెత్తిన అధిక జనాభా కత్తి

జిల్లా నెత్తిన అధిక జనాభా కత్తి