
తెలుగు తమ్ముళ్ల అరాచకపర్వం
మేడికొండూరు: తొలి ఏకాదశి పర్వదినాన పేరేచర్ల సింగరయ్య స్వామి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరుగుతాయి. మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో పేరేచర్ల గ్రామంలో వరదరాజస్వామి దేవస్థానం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ ఊరేగింపుగా వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరేగింపును అడ్డగించారు. టీడీపీ జెండాలతో, పాటలతో ప్రభను అడ్డగించి గొడవకు ది గారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సర్ది చెప్పినా మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అరాచకాలు అంతా ఇంతా కాదని ప్రజలు మండిపడుతున్నారు.