
‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?
● అప్రజాస్వామిక పోకడలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ● సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిలో అక్రమ సోదాలు ఇందులో భాగమేనంటున్న ప్రజాస్వామ్యవాదులు
గృహ యోగంలో అవినీతి పర్వం
సాక్షి, నరసరావుపేట: ప్రజల ‘సాక్షి’గా ప్రభుత్వ అసమర్థతను అక్షరంతో ప్రశ్నిస్తోన్న గొంతులకు కేసుల ఉచ్చు బిగిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర యజ్ఞం చేస్తోన్న జర్నలిస్టులపై అక్రమ కేసుల కత్తులు దూస్తున్నారు. ప్రజల కన్నీళ్లను పాఠకుల కళ్లకు కడుతుంటే ఓర్చుకోలేక నిప్పులు కక్కుతున్నారు. నాయకుడ్ని కేసులు వలయంలో బంధిస్తే వెనుక ఉన్న అక్షర సైన్యం డీలా పడుతుందనే భ్రమలో ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలకు ముసుగులు వేసి అక్షరాన్ని బంధించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజా కంఠక పాలనను ఎండ గట్టినందుకే ఈ అక్కసంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరంపర కొనసాగితే రాష్ట్రంలో ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుందన్న భయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీనిని అంతా ముక్తకంఠంతో ఖండించి అడ్డుకోని పక్షంలో ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోతాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ వాదులు బలంగా తమ గొంతుకను వినిపిస్తున్నారు.
ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది...
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పని చేసే సాక్షి, సాక్షి ఎడిటర్ పై ప్రభుత్వ దుందుడుకు చర్యను పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటక ట్టుకుంటారు. – డాక్టర్ గోదా రమేష్ కుమార్,
దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు.
ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నందుకే సోదాలు...
అధికార పార్టీ, ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో పోలీసులను ఉపయోగించి అణచివేసేందుకు సర్కారు కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే సాక్షి ఎడిటర్ ఇంటిలో సోదాలు చేశారని అర్థమవుతుంది. ఏదైనా వార్త పరంగా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి తప్ప దౌర్జన్యాలు సరికాదు. ఇటువంటి పోకడలను ప్రభుత్వం మానుకోవాలి. –షేక్ శిలార్ మసూద్,
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, నరసరావుపేట
పత్రికా స్వేచ్ఛను హరించలేరు...
ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా చెప్పుకునే మీడియాను నియంత్రించటమంటే ప్రజాస్వామ్యానికే ముప్పుగా భావించాలి. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సంపాదకులపై నిర్బంధాలు ఏమాత్రం సబబుకాదు. ఇటువంటి పోకడలతో పత్రికా స్వేచ్ఛను హరించలేరు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఏ ప్రభుత్వమైనా ఇది తెలుసుకోవాలి.
– కాసా రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి,
నరసరావుపేట.
విలేకరులపై అక్రమ కేసులు, కార్యాలయాలపై దాడులు ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులను జైలుకు పంపిన ప్రభుత్వం ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజాకంటక పాలనను ఎండగడుతుండటంతో అక్కసు ముక్త కంఠంతో అడ్డుకోని పక్షంలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పు
పత్రికా స్వేచ్ఛను హరిస్తూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రెండో రోజైన శుక్రవారం కూడా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జర్నలిస్టులు నిరసన గళం విప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడంపై రాష్ట్రవాప్తంగా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం చిలకలూరిపేటలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ పి.భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తే సహించబోమని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గురజాలలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గ విలేకరులు కూడా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోనూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?

‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?

‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?

‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?