
ఉద్యోగాలు, రుణాల పేర్లతో మోసం
ఇటీవల శారదా కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ అపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. విడతలు వారీగా రూ.1.90 లక్షలు చెల్లించాను. ఉద్యోగం వచ్చాక, మిగతా రూ.3 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేశారు. అయితే, నెలలు గడిచిన ఉద్యోగం ఊసెత్తలేదు. ఈలోగా ఇంటి రుణం ఇప్పిస్తానంటే వారిద్దరికీ రూ.3.30 లక్షలు చెల్లించా. బ్యాంక్ నుంచి రుణం మంజూరైనట్లు చెక్కు కూడా చూపించారుఉ. నాతో పాటు పలువురికి రుణాలు ఇప్పిస్తామని చెబితే వారు డబ్బు చెల్లించారు. ఇద్దరికీ సుమారు రూ. 12.30 లక్షలు చెల్లించాం. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదు. మిగతా వారు నన్ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సదరు వ్యక్తులను విచారించి న్యాయం చేయాలి.
– జి.భూలక్ష్మి (దివ్యాంగురాలు), ఓర్సు పెద్దింటమ్మ, ఒకటో వీధి, ఐపీడీ కాలనీ