నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని అఖిల భారత స్థాయి 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజనీర్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు.