గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగవంతమైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. గుంటూరు జిల్లాకు ఆర్ట్స్, సైన్స్ కోర్సుల వారీగా 3.30 లక్షలు, ఒకేషనల్‌కు సంబంధించినవి 60వేల స్క్రిప్ట్స్ వచ్చాయి. స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి, ఆర్‌ఐవో జీకే జుబేర్ పర్యవేక్షణలో ఈనెల 17 నుంచి జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు.
సబ్జెక్టుల వారీగా వాల్యూయేషన్
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సబ్జెక్టుల వారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు–రెండు, ఇంగ్లీషు–19, హిందీ–ఒకటి, సంస్కృతం–15, మాధ్స్–31, సివిక్స్ రెండు చొప్పున బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినర్‌తో పాటు ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఉంటారు. వీరికి అదనంగా బోర్డుకు ఒకరు చొప్పున నియమించిన స్క్రూటినైజర్ మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, కేటాయించిన మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా 420 మంది అధ్యాపకులతో పాటు స్క్రూటినైజర్లుగా మరో 70 మంది అధ్యాపకులు విధుల్లో ఉన్నారు. కాగా 2వ స్పెల్‌లో మిగిలిన సబ్జెక్టులకు గురువారం నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఒకేషనల్ పేపర్ల వాల్యూయేషన్ కోసం ఏర్పాటు చేసిన ఆరు క్యాంపులలో ఒకటిగా గుంటూరులో కొనసాగుతుండడం గమనార్హం.
సబ్జెక్టులవారీగా ఇంటర్ వాల్యూయేషన్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనే మార్క్స్’ ట్యాబ్లేషన్ 70శాతం మంది అధ్యాపకులు విధులకు హాజరు పర్యవేక్షిస్తున్న ఆర్‌ఐఓ జుబేర్
అధ్యాపకులను రిలీవ్ చేసి వాల్యూయేషన్‌కు పంపాలి
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల నుంచి స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకుల్లో 70 శాతం మంది హాజరవుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జవాబు పత్రాలను వేగంగా మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులందరూ రావాలి. వారిని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తక్షణమే రిలీవ్ చేసి వాల్యూయేషన్ కేంద్రానికి పంపాలి. లేకుంటే శాఖాపరమైన చర్యలతోపాటు జరిమానా విధిస్తాం.
– జీకే జుబేర్, ఇంటర్‌విద్య ఆర్‌ఐవో, గుంటూరు
మూల్యాంకనం వేగవంతం
మూల్యాంకనం వేగవంతం