ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా ఇప్పటికీ తూకాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వ్యాపారులు పాత రాళ్ల కాటాలనే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు పెట్టుకున్నా.. 200 గ్రాములు తక్కువ తూగేలా సెట్టింగ్స్ చేసుకుంటున్నారు. ప్రముఖ మాల్స్, మార్లుల్లో లభ్యమైన ప్యాకేజీ వస్తువులూ తూకం తక్కువ ఉంటున్నాయి. నాణ్యత ప్రమాణాలు లేకుండా.. తూకంలో తేడాలు చేయడంపై తూనికలు కొలతలు శాఖ 2024–25 ఆర్థ్ధిక సంవత్సరంలో జిల్లాలో 576 కేసులు, ప్యాకేజ్డ్ కమోడిటీ మోసాలపై 426 కేసులు మొత్తం 1,002 కేసులు నమోదు చేసింది.