తెనాలి: చెంచుపేట అమరావతి కాలనీలోని శ్రీగోదా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఈనెల 17 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, వేదవిన్నపాలు, ప్రధాన కలశస్థాపన, చతుస్థానార్చనలు, నిత్యపూర్ణాహుతి చేశారు. ఉదయం 10 గంటలకు ‘ధ్వజారోహణం’, గరుడ ప్రసాదగోష్టి తదుపరి తీర్థప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణ, నిత్యహోమం, భేరిపూజ, దేవతాహ్వానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈనె 15వ తేదీన శ్రీస్వామివారి కళాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. వార్షికోత్సవాలకు ముందుగా ఈనెల 9వ తేదీనుండి 11వ తేదీవరకు అధ్యయనోత్సవాలు జరిగాయి.