అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌

Mar 10 2025 10:41 AM | Updated on Mar 10 2025 10:36 AM

చీరాల: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు. వేటపాలెం మండలం రామాపురంలోని బీచ్‌ రోడ్‌లోని వాయల రాంబాబు కూల్‌డ్రింక్‌ షాపులో రైడ్‌ చేయగా విస్కీ7 సీసాలు, ఇంపీరియల్‌ బ్లూ 4, ఎంసీ డోవేల్స్‌ 3 మొత్తం 14 బాటిల్స్‌ను సీజ్‌ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మడం నేరమన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

చీరాలటౌన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్‌ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్‌ యూసుఫ్‌ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్‌.కృపాచార్యులు, జనరల్‌ సెక్రటరీగా సాయి మహేష్‌, ఉపాద్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

గూడ్స్‌ రైలు కిందపడి టైల్స్‌ మేస్త్రి ఆత్మహత్య

నరసరావుపేట టౌన్‌: గూడ్స్‌ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్‌ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌ 1
1/2

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌ 2
2/2

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement