అద్దంకి: భవనాశి కాలువలో కొండ చిలువ కలకలం రేపింది. అయితే కొందరికి మొసలి కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణానికి చెందిన సుద్దపల్లి కోటయ్య వాగులో కొండచిలువ ఉందని ఫారెస్ట్ అధికారులకు అందిన సమాచారం మేరకు.. నరసింహపురం సమీపంలోని భవనాశి కాలువను పరిశీలించారు. అలాగే ముగ్గు వాగులో మొసలి సంచిరిస్తుందని నంగవరపు సుధీర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడా పరిశీలించారు. ఈ క్రమంలో భవనాశి కాలువలో కొండచిలువను గుర్తించామని అధికారి తెలిపారు. ముగ్గు వాగులో మొసలి జాడలు కనిపించలేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరలా మొసలి సంచారం కనిపిస్తే తమకు తెలియజేయాలని స్థానిక రైతులకు చెప్పారు.
ముగ్గు వాగులో మొసలి? జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక