మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే శ్రీవారిని, అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించారు. అనంతరం స్వామిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెళ్లికుమారుడి ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాన్ని ఆలయ ఈఓ రామకోట్టిరెడ్డి పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13న స్వామి దివ్య కల్యాణం, 14న రథోత్సవం జరుగుతాయని వివరించారు.
లక్ష్మీనరసింహుని
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెళ్లి కుమారుడిగా శ్రీవారు
13న కల్యాణ మహోత్సవం
14న స్వామి రథోత్సవం
దివ్యోత్సవం.. నేత్రోత్సవం