
కళ్లజోళ్లు పొందిన వారితో బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ
కొరిటెపాడు(గుంటూరు): పేదరిక రహిత సమాజ స్థాపనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టి, దార్శనికత స్ఫూర్తిదాయకమని బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ అన్నారు. పొన్నూరు మండలం, ములుకుదురు గ్రామంలో ఈ నెల 3న బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరంలో భాగంగా నిర్వహించిన నేత్ర జ్యోతి వైద్య శిబిరంలో నిర్ధారించిన 912 మందికి వారి లోపం ఆధారంగా కళ్లజోళ్లను సిద్ధం చేశారు. బజరంగ్ ఫౌండేషన్ అధినేత అంబటి మురళీకృష్ణ ఆదివారం వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏళ్ల తరబడి దృష్టి లోపం ఉన్న వారి సమస్యకి కేవలం ఒక కళ్లజోడు పరిష్కారం ఇస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు పేదరికం, వెనుకబాటుతనంతో మగ్గుతున్న వారికి జగనన్న సంక్షేమ పథకాలు ఊరట కలిగించి, వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని తెలిపారు. బజరంగ్ ఫౌండేషన్ నేత్రజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఆర్థిక స్తోమత లేని వెనుకబడిన వర్గాల వారికి నేత్ర సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్నట్లు వివరించారు. సేవా కార్యక్రమాల్ని పేదల ముంగిట్లోకి తీసుకువచ్చి, ఎక్కడ ఉండే వారికి అక్కడే శిబిరాల్ని ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యుల ద్వారా పరీక్షలను జరిపిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యను బట్టి వారికి కళ్లజోళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి, శిబిరం పూర్తయిన ఏడు రోజుల్లోనే అందిస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు మండలంలోని ములుకుదురు, మాచవరం గ్రామాలకు చెందిన 912 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. బజరంగ్ ఫౌండేషన్ సామాజిక సేవా విభాగం బృంద సభ్యులు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించినట్లు అంబటి మురళీకృష్ణ తెలిపారు.
బజరంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ రెండు గ్రామాల్లో 912 మందికి కళ్లజోళ్లు పంపిణీ