
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను తనిఖీలు చేయడం జరిగిందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ అన్నా రు. శనివారం గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పల్నాడు, ఫలుక్‌నామ, గరిబ్‌రథ్, మాచర్ల రైళ్లను గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుంటూరు డివిజన్ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ, ఏడీఆర్‌ఎం సైమాన్, డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ హరప్రసాద్ స్వయంగా తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీలు ప్రధానంగా గత కొద్ది రోజులుగా దీపావళి పండుగను పురస్కరించు కుని పేలుడు పదార్థాలను రైళ్లలో సరఫరా చేస్తున్నట్లు ఉన్నతాఽధికారులకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు తనిఖీలు చేస్తున్నామన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నవంబర్ మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 800 రైళ్లలను తనిఖీ చేసి రెండు కేసులు బనాయించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment