
‘సాక్షి’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
డాక్టర్ శ్రీకాంత్ మోటివేషన్ స్పీచ్ చాలా బాగుంది. ఏ మార్గంలో ముందుకెళితే మంచి అవకాశాలను అందుకోవచ్చనే అంశంపై ఒక అవగాహన వచ్చింది. బిజినెల్ అనలిటిక్స్ ప్రత్యేకత, వాటిలోని ఆఫర్లను ఆసక్తి కలిగించేలా వివరించారు.
– విజయమోహన్, బీసీఏ విద్యార్థి
నేటి సమాజంలో ఈ–కామర్స్ ప్రాధాన్యం పెరుగుతున్న విధానం, అందులో డేటా అనలిసిస్ట్ కీలకమైన్న అంశాలు చాలా బాగా అర్థమయ్యాయి. ఐటీలోనే కాకుండా మేనేజ్‌మెంట్‌లోనూ అపార అవకాశాలపై విహంగ వీక్షణంలా చెప్పిన తీరు బాగుంది.
– రవలిక, బీసీఏ విద్యార్థిని
సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు
మాట్లాడుతున్న డాక్టర్ ఎ.శ్రీకాంత్
తెనాలి: సాంకేతిక నైపుణ్యాలతోపాటు నిర్వహణ(మేనేజ్‌మెంట్) నైపుణ్యాలు చాలా అవసరమని కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ అనలటిక్స్ విభాగం అధిపతి డాక్టర్ ఎ.శ్రీకాంత్ అన్నారు. స్థానిక ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజ్‌లో ‘సాక్షి’ గ్రూపు, కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘బిజినెస్ అనలటిక్స్ అండ్ ఈ–కామర్స్ టెక్నాలజీస్’ అనే అంశంపై సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సుకు ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ అధ్యక్షత వహించారు. బీసీఏ, బీకాం (కంప్యూటర్స్) విద్యార్థుల నుద్దేశించి డాక్టర్ ఎ.శ్రీకాంత్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి వివిధ వయసులు కలిగిన వ్యక్తులతో చాకచక్యంగా పనిచేయించుకోవటమే మేనేజ్‌మెంట్‌గా చెప్పారు. ఈ నైపుణ్యం తెలిసినపుడు అవకాశాలకు ఆకాశమే హద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న ప్రపంచంలో అనలటికల్ స్కిల్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని వివిధ రకాల కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఔట్‌లెట్లను తెరచి చేస్తున్న వ్యాపారాల ఫలితంగా బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఓ కంపెనీ నెలనెలా చేస్తున్న కోట్లాది లావాదేవీల డేటాను అనలైజ్ చేయటం గొప్ప టాస్క్‌గా చెప్పారు. ఫలితంగానే ‘మార్కెట్ బాస్కెట్ అనాలసిస్’ కీలకమైందని తెలిపారు.
అనలటికల్ స్కిల్స్ కీలకపాత్ర..
ఆ క్రమంలోనే అనలటికల్ స్కిల్స్ కీలకపాత్ర వహిస్తున్నాయని డాక్టర్ ఎ.శ్రీకాంత్ తెలిపారు. వీటిలోనే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మిషీన్ లాంగ్వేజ్ వంటివి ఉన్నాయన్నారు. మేథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ నాలెడ్జి కలిగిన విద్యార్థులకు ఈ రంగంలో బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయన్నారు. అనలటిక్స్‌లో కాంపిటేటివ్, క్వాలిటేటివ్ డేటా విజువలైజేషన్ వంటి మూడు విభాగాలు ఉంటాయని చెప్పారు. ఈ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అమెజాన్, కేపీఎంజీ, నీల్సన్, గాట్నర్ వంటి కంపెనీల్లో ఉపాధిని అవకాశాలు ఉన్నట్లు వివరించారు. వీటిలో ఉద్యోగం రూ.8–12 లక్షల ప్యాకేజితో మొదలవుతుందని తెలిపారు. ఏడాది అనుభవానికి రూ.15 లక్షల ప్యాకేజి, రెండేళ్ల అనుభవముంటే రూ.20 లక్షల చొప్పున వేతనం భారీగా పెరుగుతూ ఉంటుందని వివరించారు. మంచి అవకాశాల కోసం ఐబీఎం, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, కేపీజీఎం వంటి సంస్థలు సర్టిఫికేషన్ ఇస్తున్నాయని వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. అనంతరం కేఎల్ యూనివర్సిటీ తరఫున ఏఎస్‌ఎన్ డిగ్రీ విద్యార్థుల్లో అకడమిక్ ప్రతిభావంతులైన షేక్ జఫ్రీన్, వాసుదేవ, మణికంఠ, ఎస్.లికిత, ఎం.మెగసారికలకు డాక్టర్ ఎ.శ్రీకాంత్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు. కేఎల్‌యూ రీజనల్ మేనేజర్లు టి.నారాయణ, జి.నాగరాజు పాల్గొన్నారు.
బిజినెస్ అనలటిక్స్‌లో ఇన్ని అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఈ–కామర్స్ విస్తరిస్తున్న తీరు, వెల్లువెత్తుతున్న ఉపాధి రంగం చాలా ఆశలను రేకెత్తిస్తోంది. ఇన్ని విషయాలు తెలుసుకుంటామని అనుకోలేదు. జీవితంలో చాలా ఉపయోగం
– తేజస్వి, బీసీఏ విద్యార్థిని
నిర్వహణ, నైపుణ్యాలకు అపార అవకాశాలు






