నీ తొక్కుడు.. సాటెవ్వ‌డూ! | Young Man travels from Kerala to Nepal on a one wheel cycle | Sakshi
Sakshi News home page

ఒంటి చ‌క్రం సైకిల్‌పై సాహ‌స‌యాత్ర‌!

May 22 2026 5:22 PM | Updated on May 22 2026 6:15 PM

Young Man travels from Kerala to Nepal on a one wheel cycle

మీరు ఎప్పుడైనా రెండు చ‌క్రాల‌ సైకిల్  తొక్కారా? ఏమిటీ పిచ్చి ప్ర‌శ్న‌.. సైకిల్‌కు రెండు చ‌క్రాలు కాక‌పోతే నాలుగు ఉంటాయా? సింగిల్ వీల్ సైకిల్ ట్రై చేశారా? తొక్క‌డం మాట అటుంచి కనీసం ఎప్పుడు చూడ‌లేదు అంటారా? ఒంటి చ‌క్రం సైకిల్ కూడా ఉంటుందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే మీరు యువ రైడర్‌ స‌నీద్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవ‌రిత‌డు, ఏమిటి అత‌డి ప్ర‌త్యేక‌త?

కేర‌ళం రాష్ట్రానికి చెందిన స‌నీద్ సైకిల్‌పై నేపాల్‌కు యాత్ర చేప‌ట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అత‌డు ఒక చ‌క్రం ఉన్న సైకిల్‌పై (one wheel cycle) ఈ సాహ‌స‌యాత్ర చేస్తున్నాడు. ప్రత్యేకంగా మార్పులు చేసిన సింగిల్ వీల్ సైకిల్ తొక్కుతూ జాతీయ ర‌హ‌దారులు, పబ్లిక్ రోడ్లపై అత‌డు దూసుకుపోతుంటే జ‌నాలంతా వింత‌గా వీక్షిస్తున్నారు. తాజాగా అత‌డి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చ‌ర్యంతో పాటు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

సంక‌ల్పానికి సెల్యూట్‌
సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి, సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో స‌హ‌నంతో స‌నీద్ సాహ‌స‌యాత్ర కొన‌సాగిస్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో సామాను పెట్టుకున్నాడు. ముందు-వెనుక‌ కేర‌ళ టు నేపాల్ బోర్డు త‌గిలించుకుని, జాతీయ జెండాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇది చూసిన వాళ్లంద‌రూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. పిచ్చిత‌నం అని కొంద‌రు, సాహ‌సం అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. మామూలు మ‌నుషులు ఇలాంటి సాహ‌సాలు చేయ‌లేర‌ని చాలా మంది పేర్కొన్నారు. అత‌డి అంకితభావం, సంక‌ల్పాన్ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ర‌హ‌దారుల‌పై వెళ్లేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

సాహ‌సాల‌తో సావాసం
ఇలాంటి సాహ‌స యాత్ర‌లు సనీద్‌కు కొత్త కాదు. స్టంట్ పెర్ఫార్మర్ అయిన ఈ యువ రైడ‌ర్ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒంటి చ‌క్రం సైకిల్‌పై 5,000 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించి త‌న గురించి లోకానికి చాటాడు. ఇదే విధంగా  అతను కేరళ అంతటా దాదాపు 900 కిలోమీటర్లు ప్ర‌యాణించిన‌ట్టు త‌న సోషల్ మీడియా బయోలో పేర్కొన్నాడు. సింగిల్ వీల్ సైకిల్ దేశమంతా చుట్టిరావాల‌న్నది త‌న క‌ల అని వెల్ల‌డించాడు. సనీద్ త‌న క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement