
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ వీణా కుమారి డెర్మల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ఆమె పదోన్నతితో తెలంగాణ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1998 బ్యాచ్ అధికారి అయిన వీణాకుమారి ఆ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
తపాలా శాఖ ఇటీవలే ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 తయారీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేసి ఆ శాఖలో పలు సంస్కరణలు ప్రారంభించటంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు సెంట్రల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్‌గా, ఢిల్లీ ఢాక్ భవన్ పీఎంయూ డైరెక్టర్‌గా, మైసూరు పోస్టల్ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా, ధార్వాడ్ రీజియన్ డైరెక్టర్‌గా కూడా ఆమె విధులు నిర్వర్తించారు.
(చదవండి: ‘రండి.. ఫొటో దిగుదాం’)