సృజనాత్మక కంటెంట్‌తో నెటిజనులను అలరిస్తోంది పది సంవత్సరాల వరేణ్య బోర్బర. అస్సామ్‌లోని జోర్హత్‌కు చెందిన వరేణ్య నెటిజనులకు ‘వివేషియస్ వరేణ్య’గా సుపరిచితురాలు. ‘నువ్వు బాగా పాడుతావు’ అని వరేణ్యను కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తూ ఉండేవారు. దీంతో స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన గానాన్ని వినిపించింది.
ఉపాధ్యాయులు, క్లాస్‌మేట్‌లు తనని ఆకాశానికి ఎత్తారు. తన మీద తనకు ఆత్మవిశ్వాసం వచ్చింది. కంటెంట్ క్రియేటర్‌గా మారడానికి ఆ ఆత్మవిశ్వాసమే కారణం. స్పష్టమైన, అనర్గళమైన ఆంగ్ల భాషా నైపుణ్యంతో సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది వరేణ్య. ‘ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కోసం తరచుగా ఇంగ్లీష్ సినిమాలు, కార్టూన్ షోలు చూస్తుంటాను’ అని చెబుతుంది వరేణ్య.
ఇంగ్లీష్ భాషపై వరేణ్యకు ఉన్న ఫ్యాషన్, తన కంటెంట్‌కు సెంట్రల్ థీమ్‌గా మారింది. ఇంగ్లీష్‌ను సులభంగా ఎలా నేర్చుకోవాలి, స్పష్టంగా ఎలా మాట్లాడాలి అనేదానికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసింది. వరేణ్య నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌లో వ్లోగ్స్, మ్యూజిక్, ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వరేణ్యకు రెండు మిలియన్‌ల ఫాలోవర్‌లు ఉన్నారు.


