వింటర్ టైమ్ బ్రైట్‌గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్‌లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్‌గా తప్పించుకోవాలన్నాఈ సీజన్‌కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్‌గా మదిని దోచేస్తున్నాయి.
వెల్వెట్‌నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్‌కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి.
దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్‌తో డ్రెస్ డిజైనింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్‌కోట్స్, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోవచ్చు.
ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్‌లో వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్‌లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్‌గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.
ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్‌పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్‌కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్‌గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్‌తో మెరిసిపోయేవీ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment