
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..
ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..
ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్‌ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్‌లు ఉంటాయి.
ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్‌గా పరిగణిస్తారు.
ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్‌లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్‌ల సాయంతో గుర్తిస్తారు.
మనుగడ రేటు అనేది స్కాన్‌లో మెటాస్టేజ్‌ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు.
ఎలా చికిత్స చేస్తారంటే..
కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: