
శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్లగలమని, శివతత్వాన్ని మరోసారి పాటలో ప్రతిబింబించారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ నేతృత్వంలో రూపొందించిన ‘కైలాసవాస శివ’ పాటను నగరంలోని ప్రసాద్ ల్యాబ్ వేదికగా సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల, శ్రీనివాస్ అవసరాల, బీవీఎస్ రవి, యదువంశీ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పాట విన్నాక భావోద్వేగంతో మళ్లీ ఓసారి కాశీకి వెళ్లాలనిపించిందని భరణి అన్నారు. ఆసియాలోనే అత్యంత ప్రాచీన నగరమైన కాశీ, కాశీ సాహిత్యానికి సంబంధించి తెలుగులో మొదటిసారి ఏనుగుల వీరాస్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ను రచించారని గుర్తు చేశారు.
రౌద్రానికి భిన్నంగా శాంతి సంగీతం..
కుంభమేళా జరిగిన నెల రోజులకు కాశీ వెళ్లి ఈ పాట చిత్రీకరించామని సంగీత దర్శకులు అనుదీప్ అన్నారు. శివుడి పాటలంటేనే గుర్తొచ్చే స్వరం.. విజయ్ ప్రకాశ్. ఆయనే తెలుగు, హిందీ భాషల్లో ఈ పాట పాడారు. అద్భుతమైన తెలుగు పదాలతో కిట్టు రాసిన ఈ పాట ప్రైవేట్ ఆల్బమ్స్‌లో పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం.
ఈ పాట నిర్మాణానికి ఎస్‌ఆర్‌డీ సంస్థ ఆర్థిక సాయం అందించింది. శివుడి పాట అంటే రౌద్రం, హై పిచ్ మ్యూజిక్ ఎక్కువ. కానీ శివుడిలోని ధ్యాన సంద్రం, శాంతిని ప్రతిబింబించేలా స్లో మెలోడీలో ఈ పాట చేశామని పేర్కొన్నారు. డైరెక్టర్ నాగ్ అర్జున్ రెడ్డి, మాలిక్‌రామ్, హర్షితా రెడ్డి, కమిటీ కుర్రోళ్లు సిసీ బృందం పాల్గొని సందడి చేసింది.
(చదవండి: