
ఒకప్పుడు ఎండను తప్పించుకోవడమే వేసవి విహారాల లక్ష్యంగా ప్రయాణాలు ప్లాన్ చేసేవారు. అయితే ఇప్పుడు దీంతో పాటే వైవిధ్యభరిత జ్ఞాపకాలను కూడా అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విభిన్న రకాల హాలిడే స్పాట్స్‌ను అన్వేషిస్తున్నారు. వేసవి సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్‌లో బుకింగ్స్ అనుసరించి ప్రముఖ ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్న లెక్కల ప్రకారం.. మారిన హైదరాబాద్ నగరవాసుల విహార యాత్రాభిరుచులు ఇలా ఉన్నాయి.
చాలా మంది సిటిజనులు ప్రశాంతతనే అత్యంత ప్రధాన గమ్యంగా మార్చుకుంటున్నారు. అందుకే అర్థవంతమైన ప్రయాణం కోసం ఆఫ్–సీజన్ గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అంతగా పర్యాటకుల రద్దీ కనబడని ప్రాంతాలను కోరుకుంటున్నారు. ‘ఈశాన్య ప్రాంతాలకు, ముఖ్యంగా మేఘాలయకు బుకింగ్స్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
అని ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్న ట్రావెల్ ఎక్స్‌పర్ట్ లక్ష్మి చెప్పారు. ‘ఈశాన్య, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ తరహా టూర్స్‌కి ప్రసిద్ధి చెందినప్పటికీ రాజస్థాన్, వారణాసి వంటి ఆధ్యాతి్మక పట్టణాలు ఆఫ్–సీజలో అనూహ్య డిమాండ్‌ను చవిచూస్తున్నాయని మరొక ఆపరేటర్ సృజన చెప్పారు. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని ఔలీ, మేఘాలయలోని షిల్లాంగ్‌కు ఈ ఏడాది డిమాండ్ అధికంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ మానసిక ప్రశాంతత కోరుకునే వారిని లద్దాఖ్ పాక్షిక సాహస యాత్రికులను కేదార్‌నాథ్ ఆకర్షిస్తున్నాయి.
ట్రెక్కింగ్‌కు జై..
సమ్మర్‌లో వెనుకంజలో ఉండే ట్రెక్కింగ్ సరదా..ఇప్పుడు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పూర్తిస్థాయిలో తమకు వెన్నుదన్నుగా ఉండే సంస్థలు నిర్వహించే ఆర్గనైజ్డ్ ట్రెక్కింగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. హంప్టా పాస్, భంగు సరస్సు చంద్రఖని ట్రెక్ ట్రయిల్స్‌కు బృందాలు బుక్ చేస్తున్నాయి. భద్రత, వసతి సౌకర్యాలతో పాటు అన్ని రకాల మద్ధతు అందించే ఇండియాహైక్స్ మోక్స్‌టైన్ వంటి ఏజెన్సీల సారథ్యంలో నిర్వహించే ట్రెక్‌లకు బుకింగ్స్ బాగా పెరిగాయి.
మండే ఎడారిపై మనసు..
‘ఇప్పుడు సిటిజనులు కేవలం చల్లని ప్రదేశాలను మాత్రమే సందర్శించాలని కోరుకోవడం లేదు. వాతావరణం అనుకూలించకున్నా రాజస్థాన్‌ను సైతం ఎంచుకుంటున్నారు. ‘ఈ సమయంలో అసలైన డిసర్ట్ బ్యూటీని ఎంజాయ్ చేయాలని మాత్రమే కాదు ఈ సమయంలో అక్కడ హోటల్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి’ అని సిటీలో ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న అబ్దుల్ హుస్సేన్ అన్నారు. సిటిజనుల డిమాండ్ వల్ల మౌంట్ అబూకి బుకింగ్స్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం సీజన్ కానప్పటికీ వారణాసి కూడా డిమాండ్‌లోనే ఉంది.
అంతర్జాతీయం.. వ్యూహాత్మకం..
సిటీ నుంచి సమ్మర్‌లో చేసే అంతర్జాతీయ ప్రయాణం రెండు రకాలుగా మారిందని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒకటి భారీ బడ్జెట్ కాగా రెండోది వ్యూహాత్మకం. విదేశాలకు వెళ్లాలి కానీ వ్యయప్రయాసలు తక్కువ ఉండాలి అనే ఆలోచన కలిగిన వారు వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేసవిలో ఖర్చుకు వెనుకాడని నగరవాసులు స్విట్జర్లాండ్, పారిస్, ఇటలీ, ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్, కజకిస్తాన్, ఉరుమ్‌కియిన్ చైనా, ప్యాకేజీ టూర్‌లను బుక్ చేస్తున్నారు.
వీసా సమస్యలు తక్కువగా ఉండడం.. ప్రత్యక్ష విమానాలు చౌకైన మారి్పడుల కారణంగా థాయిలాండ్, ఈజిప్ట్ కూడా సిటిజనుల ఆదరణ పొందుతున్నాయి. టర్కీ, కైరో–ఇస్తాంబుల్‌కు కూడా బుకింగ్స్ ఉన్నప్పటికీ తర్వాతి పరిణామాల నేపథ్యంలో టరీ్కకి అత్యధిక క్యాన్సిలేషన్స్ వచ్చాయని బుకింగ్ ఏజెంట్ రియాజ్ అహ్మద్ అంటున్నారు.
మే మధ్య నుంచే ప్రారంభం..
‘తక్కువ దూరంలో ఉండి, తరచూ వెళ్లే ప్రాంతాలనే కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సోలో యాత్రికులు, కొన్ని ప్రత్యేక బృందాలు మాత్రం కొత్తరకం టూర్లకు సై అంటున్నారు. ఏప్రిల్ చివరి నుంచి మే మధ్యలో సమ్మర్ ్చు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మే మొదటి రెండు వారార్లో భారీ రద్దీని చవిచూశామని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు.
(చదవండి: శృంగేశ్వర్‌పూర్..రాముని వనపథం..)