Neer Mor Drink: సింపుల్‌గా ఇంట్లోనే తయారుచేసుకునే నీర్‌ మోర్‌.. ఒక్కసారి తాగారంటే

Summer Drinks: Neer Mor Recipe And Health Benefits - Sakshi

నీర్‌ మోర్‌ 

Summer Drinks- Neer Mor: పెరుగుతో తయారు చేసే  నీర్‌ మోర్‌ను మంచి ఎండల్లో తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు. దాహం కూడా తీరుతుంది. జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా ప్రోత్సహించి, ఎసిడిటీ సమస్యలను దరిచేరనివ్వదు. రక్త పోటు(బీపీ)ను నియంత్రణలో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్‌ డ్రింక్‌ తయారీ విధానం తెలుసుకుందామా! 

నీర్‌ మోర్‌ తయారీకి కావలసినవి:
►పెరుగు – కప్పు, నీళ్లు – కప్పు
►అల్లం తరుగు – టీస్పూను
►మిరియాల పొడి – పావు టీస్పూను
►పచ్చిమిర్చి – ఒకటి
►కరివేప ఆకులు – ఏడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా. 
తాలింపునకు: ఆయిల్‌ – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. 

నీర్‌ మోర్‌ తయారీ విధానం:
►బ్లెండర్లో కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు వేసి గ్రైండ్‌ చేయాలి.
►ఇవన్నీ గ్రైండ్‌ అయ్యాక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.
►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోవాలి.
►ఇప్పుడు బాణలిలో ఆయిల్‌ వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
►తర్వాత ఇంగువ వేసి దించేయాలి.
►తాలింపు మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి తిప్పితే నీర్‌ మోర్‌ రెడీ. దీనిని వెంటనే తాగితే చాలా బావుంటుంది.

చదవండి👉🏾 Maredu Juice: మారేడు జ్యూస్‌ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top