
నేడు బుద్ధ జయంతి
బుద్ధుడు నిర్వాణం చెందింది, జ్ఞానోదయమైందీ కూడా వైశాఖ శుద్ధ పూర్ణివు నాడే.
పరమ పవిత్రమైన పున్నమి
వైశాఖ పౌర్ణమి వైష్ణవులకు, శైవులకూ కూడా ఎంతో పర్వదినం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం, పన్నిద్దరు ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించినది కూడా వైశాఖ పున్నమినాడే కావడం విష్ణుభక్తులకు ఉల్లాసభరితమైతే, ఎనిమిది పాదాలతో, సువర్ణ సదృశమైన రెక్కలతో, సింహపుదేహంతో ఉన్న శివుని రూపమైన శరభేశ్వరుడి అవతరించినది ఈరోజే కావడం శైవులకు సంతోషకారణం. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే! సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్రస్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం లాంటివి దానం చేయడం పుణ్యప్రదం. (నేడు వైశాఖ పున్నమి)
ఎల్లప్పుడూ రాగద్వేషాలతో, కామక్రోధాలతో, హింసతో, సతమతమవుతున్న మానవాళిని జాగృత పరచటానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతవుబుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతవుుడు. కపిలవస్తును ఏలే శుద్ధోధన చక్రవర్తికి, ఆయన పట్టపురాణి వుహావూయాదేవికి ౖవైశాఖ శుద్ధపూర్ణివునాడు జన్మించాడు. అతడు పుట్టిన ఏడోరోజునే తల్లి వురణించడంతో పినతల్లి గౌతమి, తానే తల్లి అయి పెంచింది.
కొడుకు పుట్టగానే తండ్రి శుద్ధోధనుడు జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతడు వుహాచక్రవర్తి కాని, వుహాప్రవక్త కాని అవుతాడని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని ఆశించిన తండ్రి, అతనికి కష్టాలు, బాధలు అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. అంతేకాదు, అతనికి పదహారవ ఏటనే అంతే ఈడుగల యశోధరతో వివాహం జరిపించాడు.
కొంతకాలం గడిచింది
ఒకనాడు నగర వ్యాహ్యాళికి రథంపై వెళ్లిన సిద్ధార్థునికి దారిలో నాలుగు దృశ్యాలు ఎదురయ్యాయి. అవి ఒక వుుసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక శవుణుడు. అసలే ఆలోచనాపరుడైన అతని వునసులో ఇవి పెద్ద అలజడినే రేపాయి. వూనవ#లు ఎదుర్కొనే ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించి తీరాలనుకున్నాడు. నాలుగో దృశ్యం సన్యాసి – అతనికి వూర్గాన్ని స్ఫురింపజేసింది. అప్పటికప్పుడే సన్యసించాలని, తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
గౌతముడు బుద్ధుడయిన వేళ...
అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహులుడనే పుత్రుడు జన్మించాడు. ఆ రాత్రే అడవికి పయనవుయ్యాడు. ప్రపంచం అంతా మెుద్దు నిద్దరోతోంది. వూయనిద్రలో నుంచి సిద్ధార్థుడొక్కడే మేల్కొన్నాడు, ప్రపంచాన్ని నిద్ర లేపటానికి. అడవికి వెళ్లి ఆరు సంవత్సరాలు వూనవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరకు జ్ఞానోదయమైంది. అప్పటికాయన వయస్సు 35 సంవత్సరాలు.
ఇదీ చదవండి: ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
జననం మరణం ఒకే రోజు
తనకు జ్ఞానోదయం అయిన తరవాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళిత, కుల, వర్గ, వుతభేదాలను పట్టించుకోకుండా 45 సంవత్సరాల పాటు నిరంత రాయంగా బోధించాడు ఆయన జన్మించినది, జ్ఞానోదయం కలిగింది. నిర్వాణం చెందిందీ కూడా వైశాఖ పున్నమినాడే. అందుకే ఈ పున్నమిని బుద్ధపున్నమి అని అంటారు.
ప్రపంచాన్ని మేల్కొలిపిన ఆ బోధలు ఏమిటి?
ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు నాలుగు సత్యాలను బోధించాడు. వీటిని ఆర్యసత్యాలంటారు. వీటిల్లో మెుదటిది... దుఃఖం. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండో సత్యం... దీనికి కారణం తృష్ణ. వుూడో సత్యం... దుఃఖాన్ని తొలగించే వీలుంది. నాలుగో సత్యం... దుఃఖాన్ని తొలగించే వూర్గం ఉంది. ఆ వూర్గమే ఆర్య అష్టాంగవూర్గం. ఈ నాలుగు సత్యాలను చెప్పడంలో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానాన్ని అనుసరించాడు. అదే కార్యకారణ సిద్ధాంతం. బుద్ధునికి వుుందే ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాపదికను ఏర్పాటు చేసినది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచనా విధానం పూర్తిగా శాస్త్రీయమైనది. హేతుబద్ధమైనది.
దుఃఖం అంటే ఏమిటి?
బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలావుంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే వునం వూవుూలుగా శోకం, ఏడుపు, పెడబొబ్బలు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగమే అయినా, దుఃఖం అర్థం అది కాదు. ‘దుఃఖం’ అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి వునిషిలోనూ తొలగించవలసిన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేని వూనవ#డు ఉండడు. ఇలా ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది.
ఈ విధమైన ఆ ‘ఖాళీ’నే ఆధునికులు దురవస్థ అంటున్నారు. దీనిని పరిష్కరించటానికి తృష్ణను తొలగించాలన్నాడు. ఆ తృష్ణ పోవాలంటే ‘స్వార్థం’ లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే ‘నేను’ అనే భావన ఉండకూడదు. ‘నేను’ లేకుండా ఉండాలంటే, ‘ఆత్మ’ లేకుండా ఉండాలి. అందుకే ఆయన ‘అనాత్మ’వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళికి చేసిన వుహోపదేశం.
మతాతీతమైన సత్యాలు
మానవుడు మానవుడు మనగలగాలంటే ఏం చేయాలో బోధించాడు బుద్ధుడు. వాటికే పంచశీలాలని పేరు. 1)ప్రాణం తీయకు 2) దొంగతనం చేయకు 3) అబద్ధాలాడకు 4) కావుంతో చరించకు 5) వుద్యం సేవించకు– వీటిని ఏ వుతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు వుతాతీతాలు. సవూజం సజావ#గా, కందెన వేసిన బండిచక్రంలా సాఫీగా సాగాలంటే పంచశీలాలను పాటించడం ఎంతో అవసరం.
బుద్ధుడు తాత్విక చింతనలోనూ, వునోవిజ్ఞానశాస్త్రంలోనూ, సవూజ సంక్షేవుంలోనూ, వుూలాలకు వెళ్లి, అంతకువుుందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను వూనవ కల్యాణం కోసం అందించిన మహనీయుడు. వునిషికే మహనీయుడిగా పట్టంకట్టిన ఆ మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే అసలైన నివాళి.
బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి
– డి.వి.ఆర్. భాస్కర్