
మొబైల్ స్క్రీన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన షార్ట్–ఫామ్ వీడియో సిరీస్ వెర్టికల్ డ్రామా లేదా మైక్రోడ్రామా. ఆసియా దేశాలలో ‘వెర్టికల్ డ్రామా’ ట్రెండ్ ఊపందుకుంటోంది. వెర్టికల్ స్క్రీన్స్ కోసం డిజైన్ చేసిన స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ ఇది. వెర్టికల్ డ్రామా అనేది సంప్రదాయ సినిమా, టీవీ ఫార్మాట్‌ల కోసం డిజైన్ చేసింది కాదు.
స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేసిన షార్ట్–ఫామ్, మొబైల్–ఫస్ట్ నేరేటివ్ కంటెంట్. ‘వెర్టికల్ డ్రామా’ మైక్రో–ఎపిసోడ్‌లు 1 నుంచి 5 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. క్షణాల వ్యవధిలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. వుయ్ టీవి, కుౖయెషూలాంటి ఫ్లాట్‌ఫామ్స్ వెరిక్టల్ స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి అధిక పెట్టుబడులు పెడుతున్నాయి.
ప్రేక్షకులు వెర్టికల్ డ్రామాలను ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయానికి వస్తే... కన్వీనియెన్స్ అనేది మొదటిది. కాఫీ కోసం ఎదురు చూస్తూనో, కాఫీ తాగడం పూర్తయ్యేలోపు వెర్టికల్ డ్రామాలను చూడవచ్చు. చాలా తక్కువ నిడివి ఉండడం వల్ల ఒకేసారి ఎన్నో వీడియోలు చూడవచ్చు. వెరిక్టల్ డ్రామాలలోని క్యారెక్టర్లు రకరకాల భావోద్వేగాలతో ఉండడం వల్ల ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవుతారు.
కొన్ని సర్వేల ప్రకారం ప్రేక్షకులు మొబైల్‌లో షార్ట్–ఫామ్ కంటెంట్‌ను చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌత్ కొరియాలో ‘ఏ–టీన్’ అనే వెర్టికల్ డ్రామా నెల వ్యవధిలో 6 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘వెర్టికల్ డ్రామా’ అనేది కేవలం సృజనాత్మకతకు సంబంధించినదే కాదు మంచి ఆదాయ వనరుగానూ మారింది.