
మహా అయితే రెండో, మూడో డిగ్రీలు చేస్తారు. గానీ ఇన్ని డిగ్రీలా..జీవితాంతం చదువుతూ ఉండటం అంటే.. అది సాధ్యం కాని పని. అయితే ఈ ప్రోఫెసర్ దాన్ని సాధ్యం చేసి చూపడమే కాదు ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో వింటే కంగుతింటారు. మరి అన్ని డిగ్రీలు చేసేందుకు డబ్బు కూడా వెచ్చించాల్సిందే కదా..!. మరి అదంతా ఆయనకు ఎలా సాధ్యమైంది..ఇలా జీవితాంత చదువుతూ ఉండాలనేంత ఇంట్రస్ట్ ఎలా కలిగింది అంటే..
'ఫైనల్ ఎగ్జామ్స్' అనంగానే విద్యార్థులు రిలీఫ్ అయిపోతారు. ఇక ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది, ఏదో ఉద్యోగం పొంది..సెటిల్ అయిపోవడమే అనుకుంటాం. అదీగాక ఓ రెండు మూడు డిగ్రీలకు మించి పూర్తి చేయరు కూడా. అలాంటిది చెన్నైకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి ఎన్ పార్థిబన్(Prof Parthiban) ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నాడో తెలిస్తే నోటమాటరాదు.
సినిమాల్లో చూపించిన హీరో మాదిరిగా అతడి ధృడ సంకల్పం చూస్తే..ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఇంత ఓపిక, ఆసక్తి ఆయనకెలా సాధ్యమైందనిపిస్తుంది. ఇలా డిగ్రీలపై డిగ్రీలు పూర్తి చేయాలన్న కోరిక తన తల్లి కారణంగా జరిగిందట.
ఆరోజు అమ్మ అలా అనడంతో..
తన తొలి డిగ్రీలో జస్ట్ అత్తెసురు మార్కులేనట. ఏదో పాసయ్యాను అని అనిపించుకన్నట్లుగా మార్కులు తెచ్చుకున్నాడట. అది చూసి ఆయన తల్లి చాలా బాధపడిందట. ఆ క్షణంలో ఆమె కోపంతో పాసవ్వడం కాదు..మంచి మార్కులు తెచ్చుకోవాలని కాస్త గట్టిగా చెప్పారట ఆమె.
దాంతో ఆయన తల్లికి టాప్ ర్యాంక్ వచ్చేలా మార్కులు తెచ్చుకుంటానని వాగ్దానం చేశారట. ఇక అక్కడ నుంచి మొదలైన ఆసక్తిని.. ఆయనలా కంటిన్యూ చేశారట. అలా ఆయన 1981 నుంచి ఇప్పటి వరకు చదువుని ఆపలేదు. ఒక పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న కోరిక కాస్త..తరగని జ్ఞాన దాహంగా పరిణమించింది.

సాటిలేరు అనేట్లుగా డిగ్రీలు..
ప్రొఫెసర్ విజయ పరంపరం షాక్‌కి గురిచేశాలా ఉంటుంది. ఏకంగా 150కి పైగా పైగా డిగ్రీలు, డిప్లోమాలు పూర్తి చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన డిగ్రీల లిస్ట్ ఓ యూనివర్సిటలో ఉండే కోర్సుల జాబిత మాదిరిగా ఉంటుంది. ఆయన ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా వంటి అంశాల్లో చాలా మాస్టర్ డిగ్రీలు పొందారు. అన్నిట్లంకటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఏకంగా 12 ఎంఫిల్ డిగ్రీలను కలిగి ఉండటం.
ప్రస్తుతం ఆయన నాల్గవ పీహెచ్‌డీ పూర్తి చేస్తున్నారట. మరి ఇన్ని డిగ్రీలు పూర్తి చేయడం కోసం ఆయన తన జీతంలో దాదాపు 90% విద్యకే ఖర్చు చేస్తారట. ఆయన తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరుకు అనేక సంస్థలో బోధిస్తారట. ఆ తర్వాత బోధనల మధ్య దొరికిన కొద్దిసేపు విరామంలో తన చదువుకి సమయాన్ని కేటాయించుకుంటారట. ఇంతలా అంటే ఒత్తిడికి గురవ్వుతాం కదా అంటే.. పార్థిబన్ మాత్రం పుస్తకాలతోనే విశ్రాంతి తీసుకుంటానని చెబుతుండటం విశేషం.
అంతేకాదండోయ్ ఆయన ఎడ్యుకేషన్ జర్నీ ఇక్కడతో పూర్తి అవ్వదట. ఆయన తదుపరి లక్ష్యం 200 డిగ్రీల మైలురాయిని పూర్తి చేయడం అని అంటున్నారు. ఉన్నత విద్య ఒక డ్రీమ్‌గా ఉన్నవారందరికీ ఈయన స్ఫూర్తి. ఇక్కడ పార్థిబన్ కేవలం డిగ్రీలపై డిగ్రీలు పూర్తిచేయడం కాదు తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని గౌరవిస్తున్నాడు, అలాగే నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. పైగా విద్యనభ్యసించడం అనేది జీవిత లక్ష్యంగా మారగలదని ప్రపంచాని చాటిచెబుతున్నాడు.
(చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!)