ఫిలడెల్ఫియా టూర్‌: 360 డిగ్రీల వర్చ్యువల్‌ అనుభవం

Philadelphia Tourism Ministry Virtual Reality Tourism - Sakshi

పలువురు టూర్‌ ఇష్టులు.. వర్చ్యువల్‌ రియాల్టీ టూర్స్‌కి ఓటేస్తున్నారు. కరోనా కారణంగా పుట్టుకొచ్చినా..కరోనా తర్వాత కూడా కొనసాగే అనేక ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా స్థిరపడుతోంది. కరోనా తర్వాత కృంగిన పర్యాటక రంగానికి పునరుత్తేజం అందించేందుకు, పర్యాటకులకు దగ్గరగా ఉండేందుకు పలు దేశాలు, పర్యాటక శాఖలు వర్చువల్‌ టూర్స్‌ని ఎంచుకుంటున్న నేపధ్యంలో ఫిలడెల్ఫియా పర్యాటక శాఖ కూడా అదే బాట పట్టింది. తమ దేశంలోని సందర్శనీయ స్థలాలతో పాటు కళలపై అభిమానంతో తమ దేశానికి ప్రత్యేకంగా వచ్చే సందర్శకుల కోసం విభిన్న రకాల ఆర్ట్, హిస్టరీ విశేషాలను, అలాగే తమకే ప్రత్యేకమైన మ్యూరల్స్, వాల్‌ ఆర్ట్‌ తదితర చిత్ర ‘విచిత్రాల’తో వర్చువల్‌ టూర్స్‌ ను ఆఫర్‌ చేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. తమ దేశంలోని మ్యూరల్‌ ఆర్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, వీరి కోసం ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌ టూర్స్‌ని అందిస్తున్నామన్నారు.

కరోనా కారణంగా తమ సైట్‌కి 50శాతం ట్రాఫిక్‌ పెరిగిందని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి టూరిస్టలకు 360 డిగ్రీల వర్చ్యువల్‌ అనుభవాన్ని అందించే వెబ్‌సైట్‌ యజమాని వర్చువల్‌ రియాల్టీ ఫొటోగ్రాఫర్‌ లీన్‌ థోబియాస్‌ చెప్పారు. తమ సైట్స్‌ ద్వారా వాయనాడ్‌లోని ఎడక్కల్‌ గుహలు, ఈజిప్టియన్‌ పిరమిడ్స్‌ వంటి ప్రాంతాలను అత్యధికులు విజిట్‌ చేశారని అంటున్నారాయన.గత కొన్ని రోజులుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయ గిరిజన కధలను చిత్రాలు,  సంబంధించిన పర్యాటక విశేషాలను నగరవాసులకు వర్చువల్లీ వివరిస్తున్నట్టు చెరిష్‌ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందిన చెరిష్‌ మంజూర చెప్పారు. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏటా నిర్వహించే బాస్కన్‌ ఫెస్టివల్‌ని కూడా అందించామన్నారు. అలాగే పర్యాటక నిపుణుల ఆధ్వర్యంలో బూట్‌ క్యాంప్స్‌ కూడా నిర్వహించామన్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top