ఆకాశంలో ఒక పెద్ద కుటుంబం! | Nirmala Reddy's Explanation About The Family Of Planets In The Sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఒక పెద్ద కుటుంబం!

May 29 2026 7:38 AM | Updated on May 29 2026 7:38 AM

Nirmala Reddy's Explanation About The Family Of Planets In The Sky

ఆకాశంలో మనలాగే ఒకరు కోపంగా, ఒకరు వేగంగా, ఒకరు ప్రేమగా, ఒకరు బ్రైట్‌గా, ఒక పెద్దగా, ఒకరు చాలా చిన్నగా...

సూర్యుడు... సౌరకుటుంబంలో ఇంటికి పెద్దవాడు సూర్యుడు. మన ఇంటికి నాన్న ఎలాగో అలా. సూర్యుడి చుట్టూ తిరిగే పిల్లల్లాంటి గ్రహాలే మన ప్లానెట్స్‌. సూర్యుడు వెలుగు, వేడి ఇస్తాడు. ‘టైమ్‌కు లేవండి!’ అని చెప్పే నాన్నలా ఉంటాడు. అందరూ అతని చుట్టూ తిరుగుతుంటారు.

బుధుడు...
ఇంటి చిన్న తమ్ముడు ఎలా వేగంగా పరుగెడతాడో బుధుడు కూడా అలానే!. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ‘నేనే ఫస్ట్‌!’ అనేలా ఉంటాడు. పగలు వేడిగా... రాత్రిళ్లు చల్లగా  చిన్నపిల్లల మూడ్స్‌ మార్చుకున్నట్టే ఉంటాడన్నమాట.

శుక్రుడు...
స్టైల్‌ క్వీన్‌గా పిలిచే ఈ గ్రహం ఆకాశంలో చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ‘నేను చాలా అందంగా ఉంటాను!’ అనుకునే అక్కలా ఉంటుందన్నమాట. మబ్బులతో ఫుల్‌ మేకప్‌ వేసుకున్నట్టుంటుంది. బయటకి వైబ్రెంట్‌గా కనిపిస్తూ, లోపల హాట్‌ హాట్‌గా ఉంటుంది. 

భూమి...
అమ్మ ప్రేమలా ఉంటుంది. మనందరం ఉండేది భూమిపైనే కదా! గిరగిరా తిరుగుతుంది ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మలా. కానీ, మనల్ని ఎక్కడా పడేయదు. జాగ్రత్తగా అందరికీ నీళ్లు, గాలి, ఆహారం ఇస్తుంది. చెట్లు, పక్షులు, మనుషులు.. అందరికీ ఇల్లు భూమే. అందుకే భూమి అంటే ప్రేమతో నిండిన ఇల్లు అన్నమాట.

అంగారకుడు...
ఎర్రగా కనిపించే గ్రహం. నా జోలికి ఎవరైనా వచ్చారా.. అంతే! అన్నట్టుగా ఉంటాడు. లోపల అంతా ఎడారిలా ΄÷డిగా ఉంటుంది. భవిష్యత్తులో మనుషులు అక్కడికి వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు. రఫ్‌గా కనిపించినా ఇంట్రెస్టింగ్‌ గ్రహం.

గురుడు...
ఇంటిలో పెద్దన్న అమ్మకు, నాన్నకు, తమ్ముడు, చెల్లెలికి సపోర్ట్‌గా ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం. పెద్ద అన్నలా అందరినీ కా΄ాడుతాడు. ‘నేను బిగ్‌ బాస్‌!’ అన్నట్టుంటాడు. చాలా పెద్దవాడు కానీ గ్యాస్‌ నింపిన పెద్ద బెలూన్‌లా కనిపిస్తాడు.

శని...
శాటర్న్‌గా పిలిచే ఈ గ్రహం చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఫ్యాషన్‌ అంటే ఇష్టం ఉన్న తాతయ్యలా ఉంటాడు. శని చుట్టూ ఉన్న రింగ్స్‌ చూసారా? ఐస్, రాళ్లతో ఆ రింగ్స్‌ ఏర్పడ్డాయట. ఆకాశంలో ఫ్యాషన్‌ స్టార్‌ అంటే శనిగ్రహమే.

ఇంకా యూరేనస్, నెఫ్ట్యూన్‌ వంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ, అవి దూరపు బంధువుల్లాంటివి. ఎప్పుడో వాళ్ల వాళ్ల గురించి ఇంట్లోవాళ్లు చెబుతుంటే వింటుంటాం. ఆకాశంలో మనలాగే ఒకరు కోపంగా, ఒకరు వేగంగా, ఒకరు ప్రేమగా, ఒకరు బ్రైట్‌గా, ఒక పెద్దగా, ఒకరు చాలా చిన్నగా... ఇలా విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎవరికి వాళ్లే అత్యంత ప్రత్యేకం. కానీ, అందరూ కలిసి ఉండటం వల్ల ఒక కుటుంబంగా స్పెషల్‌గా నిలిచిపోయారు అని చెప్పవచ్చు. ఈ విధానం వల్ల పిల్లలు రిలేషన్స్‌ గురించి, మనలోని భావోద్వేగాల గురించి, విభిన్న వ్యక్తుల గురించి అర్థం చేసుకుంటారు. వారి సృజనాత్మకతకు పని చెబుతారు. - నిర్వహణ: నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement