వెయిట్‌ లాస్‌ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..! | Mit Sinai Lost 16 kgs By Completing 10000 Step Count Daily And Eating Ice Cream | Sakshi
Sakshi News home page

వెయిట్‌ లాస్‌ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!

Sep 18 2024 11:24 AM | Updated on Sep 18 2024 11:52 AM

Mit Sinai Lost 16 kgs By Completing 10000 Step Count Daily And Eating Ice Cream

నిజ జీవితంలో బరువు తగ్గి చూపించిన వ్యక్తుల స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబ్బా ఎంతలా అంకుంఠిత దీక్షతో బరువు తగ్గారు అనే ఫీల్‌ వస్తుంది. గ్రేట్‌ అనిపిస్తుంది కూడా. బరువు తగ్గాలనేకునే వాళ్లు ముఖ్యంగా డైట్‌లో షుగర్‌కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు తగ్గాడు. అదెలా అనే కదా..!. అలా ఎలా సాధ్యమయ్యింది? నిజంగానే ఐస్‌క్రీం తింటూనే బరువు తగ్గాడా అంటే..?.

ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైటింగ్‌ స్లైల్‌ ఉంటుంది. ఇక్కడ మిట్‌ సునాయ్‌ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరిలో తాను అధిక బరువు ఉన్నట్ల గుర్తించినట్లు తెలిపాడు. అలాగే వైద్యపరీక్షల్లో కొలస్ట్రాల్‌ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని తెలియడంతో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు.  అందుకోసం సరైన జీవనశైలిని పాటిచడం తోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పాడు. రెగ్యులర్‌గా వ్యాయామం, అన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకునేలా మనసును సిద్ధం చేసుకుని డైట్‌ ప్రారంభించినట్లు తెలిపాడు. 

అయితే తన బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడింది నడక అని చెబుతున్నాడు. తాను రోజూ పదివేల అడుగులు వేసేలా చూసుకునే వాడట. అలా అన్ని స్టెప్‌లు నడిస్తేనే.. ఐస్‌క్రీం తినాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు వివరించారు. అలా అందుకోసమైన ఏ రోజు స్కిప్‌ చేయకుండా చేయగలిగానని చెబుతున్నాడు సునాయ్‌. ఆ విధంగా దాదాపు 150 రోజుల్లో అంటే.. ఐదు నెలల్లో సుమారు 16 కిలోలు పైనే బరువు తగ్గగలిగానంటూ తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. 

అలాగే డైట్‌లో ముఖ్యంగా తాను ఇష్టపడే దాల్, రోటీ, అన్నం, పండ్లు, పిజ్జా, పాస్తా, పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, శాండ్‌విచ్‌లు, స్మూతీస్ వంటివి అన్ని మితంగా తీసుకునేవాడనని అన్నాడు. ఇక్కడ మనకిష్టమైన ఫుడ్‌ని దూరం చేయకుండానే అవి తింటునే వర్కౌట్‌లతో కెలరీలు తగ్గించుకుంటూ బరువు తగ్గొచ్చని చెబుతున్నాడు మిట్‌ సినాయ్‌. బరువు తగ్గడం అంటే నోరు కట్టేసుకోవాల్సిందే అని భయపడే వాళ్లకు సునాయ్‌ వెయిట్‌ లాస్‌ స్టోరీ ఓ ఉదహరణ.

(చదవండి: కాస్మటిక్స్‌తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఇలా..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement