చిన్నారుల ఆరోగ్యానికి పాలు...

Milk Is Good For Childrens Health - Sakshi

యూనివర్సల్‌ హెల్త్‌ డ్రింక్‌ ప్యాకేజీలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్‌ బి బి1, బి2, బి12, విటమిన్‌లతో పాటు విటిమిన్‌ డి కూడా  ఉంటుంది. తీపి పదార్ధాలతో పాటు అనేక డైరీ ఉత్పత్తులకు మూలం పాలు కాబట్టి.. వీటి వినియోగం అనేక లాభాలను అందిస్తుంది.  పిల్లలకు పాల అవసరంపై పోషకాహార నిపుణులు, సిథ్స్‌ఫార్మ్స్‌ నిర్వాహకులు కిషోర్‌ ఇందుకూరి చెబుతున్న విశేషాలివే...

అత్యుత్తమ పోషకాలు...
పాలలో పొటాషియం మరియు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎదుగుదల దశలో ఎముకల పెరుగుదలకు  సహకరిస్తుంది. పాలు అనేది అన్ని పోషకాలను కలిగి ఉన్న ఏకైక పానీయం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన ఒక అధ్యయనం ప్రకారం,   6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో పాల వినియోగం తగ్గితే అది వారి 1.9% తక్కువ ఎదుగుదలకి దారితీస్తుంది. అలాగే పాలు తాగిన పిల్లల బరువు, ఎత్తులో తాగని వారితో పోలిస్తే 20% అధిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. 

అధ్యయనాల సారాంశం..
పిల్లలలో పాల వినియోగం ప్రభావాన్ని గుర్తించే అధ్యయనాలెన్నో వెలువడ్డాయి. పాలను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందని ఫోర్టిఫైడ్‌ మిల్క్‌ ప్రోగ్రామ్‌ తేల్చింది. పిల్లలలో దృష్టి లోపాన్ని తగ్గించడంలో పాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి.  పాలను ఎక్కువగా తాగడం ఐక్యు స్థాయిలలో గణనీయమైన మెరుగుదల, ఆటలు వంటి శారీరక శ్రమలపై వారికి ఆసక్తిని పెంచుతుందని కూడా ఇవి స్పష్టం చేశాయి.  

ఉత్పత్తిలో మిన్న కానీ...
పాల ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు అయినప్పటికీ 2018 గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది పిల్లలలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో పాల ప్రాముఖ్యత, పోషక విలువల దృష్ట్యా ఎన్‌డిబిబి ఫౌండేషన్‌ ఫర్‌ న్యూట్రిషన్, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలోని ట్రస్ట్‌ బలవర్థకమైన ఫ్లేవర్డ్‌ మిల్క్‌ ను ప్రవేశపెట్టింది. చిన్న పిల్లలకు ఆహారంగా పాలప్రాముఖ్యత తెలియజెప్పేలా ఐక్యరాజ్యసమితి  ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్‌ 1ని ప్రపంచ పాల దినోత్సవంగా ప్రకటించింది.

– తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను, నాణ్యమైన ప్రోటీన్‌ అందించే గొప్ప వనరు పాలు.  ఇది వయస్సు–సంబంధిత కండర నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
– కఠిన వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి సహకరిస్తుంది. 
–విటమిన్‌ డి, విటమిన్‌ కె, ఫాస్పరస్, మెగ్నీషియంతో సహా కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి పాలు శరీరానికి సహాయపడతాయి.
– బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం ఊబకాయం ప్రమాదాన్ని నివారిస్తుంది కూడా.
– పాలు అందరికీ నప్పకపోవచ్చు.  వీరి కోసం నాన్‌–డైరీ మిల్క్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
– పాలను 3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికిస్తే.. విలువైన పోషకాలను కోల్పోతుంది.
– ప్లాస్టిక్‌ డబ్బాల్లో పాలను నిల్వ ఉంచడం లేదా మైక్రోవేవ్‌ చేయడం అనేవి క్యాన్సర్‌ కారకాలు. 

–కిషోర్‌ ఇందుకూరి, పోషకాహార నిపుణులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top