
వివాహ వ్యవస్థలో కథోలిక సంఘాలలో ఏడు సంస్కారాలు పాటిస్తారు. ఒకటి– బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము, మూడు– నిర్ధారణ (కన్ఫర్మేషన్), నాలుగు – జ్ఞానస్నానం (రికన్ఫర్మేషన్), ఐదు – రోగుల పరామర్శ(ఎనాంటిగ్ ఆఫ్ సిక్), ఆరు – పరిశుద్ధ వివాహం, ఏడు – పరిశుద్ధ ఉత్తర్వులు (హోలీ ఆర్డర్స్). ఈ ఏడింటిలో ప్రాముఖ్యమైనది, ఘనమైనది, పవిత్రమైనది వివాహము.
ఇది శాశ్వతమైన బంధం. వీటిని అన్ని సంఘాలవారు ఆచరించకపోయినా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఒకటి –బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము పాటిస్తున్నారు. ప్రభువు గహాన్ని (యింటిని కట్టించక΄ోతే కట్టువాని ప్రయాస వ్యర్థమేనని, అలాగే గుణవతి అయిన భార్య లభించుట అరుదు. గుణవతి అయిన భార్య ముత్యం కంటే అమూల్యమైనది. (బైబుల్ గ్రంథంలో చూస్తాం).
బైబిల్‌లోని ఆదికాండ గ్రంథంలో హవ్వను ఆదామును కలుగజేసి తొలి/ప్రధమ కుటుంబం వారిరువురిని, తర్వాత బైబిల్‌లోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో సంఘం (చర్చ్) వధువుగాను, ప్రభువును వరుడుగాను గుర్తించండి. అలాగే వివాహం ఒప్పందం కాదు, కొనసాగించుకోవటానికి రద్దు పరచుకోవటానికి ఇది శాశ్వత బంధం.
రెక్కలు వచ్చి పిల్లలు స్థిరపడి వారు వేరే ్ర΄ాంతానికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు తోడూ నీడా ఈ రెండు పండుటాకులైన భార్యాభర్తలు, భార్య దేవుడిచ్చిన ‘వరం’, అనాది సంకల్పం చొప్పున ఏర్పడిన దాంపత్యం అనగా (మేడ్ ఫర్ ఈచ్ అదర్). దీనికి కావల్సింది సమాధానం. పెండ్లి అయిన తర్వాత మిగిలిన శేష జీవితంలో ఆనందంగా సుఖసంతోషంతో జీవించాలి. దీనికి ప్రదానం ప్రార్థన.
దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. అప్పుడు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలీయుల మీద సమాధాన ముండునుగాక (దావీదు కీర్తనలు 128:1–6). కావున ఈదీవెనలతో పిల్లా పాపలతో జీవించి, పెండ్లి అంటే నూరేళ్ళ పంటగావున, సమాధానంగా జీవించుదురు గాక.
– కోట బిపిన్ చంద్రపాల్
(చదవండి: Chandra Grahan 2025: చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..)