వివాహం మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోతున్న రోజులు. అన్ని క్షణాల్లో జరిగిపోవాలనుకునే ఈ కాలంలో ఓపిక, అవగాహన రాహిత్యం లేక కలతల కాపురంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఈ బంధనం లోంచి బయటపడతామా అన్నట్లుగా బంధాలు మారిపోతున్నాయి. పైగా ఆ వైవాహిక బంధం దిగ్విజయంగా ముగిసిపోయేలా ఎంత భయానకమైన మొక్కలు మొక్కుతున్నారో తెలిస్తే విస్తుపోతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలానే చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. జోగేష్ అనే వ్యక్తి వైవాహి బంధం దిగ్విజయంగా ముగిసిపోతే దండవత్ యాత్ర చేసి బద్వా మాతా ఆలయం దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అతనికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. ఆ బంధంలో ఎన్నో గొడవలు, విపరీతమైన అభిప్రాయ భేదాలతో గందరగోళంగా మారింది. కోలుకోలేని మానసిక ఆవేదనను మిగిల్చింది.
దాంతో ఆ వైవాహి బంధం నుంచి తొందరగా బయటపడితే ఆ బద్వామాతను ఇలా దండవత్ యాత్ర చేసుకుంటూ వచ్చి దర్శిస్తాని మొక్కుకున్నాడు. అతడు కోరుకున్నట్లుగానే చట్టప్రకారం విడాకులు తీసుకోగలిగాడు. దాంతో తన మొక్కు చెల్లించుకునేందుకు తన గ్రామం నుంచి దండవత్ యాత్ర చేస్తుండటంతో వార్తల్లో నిలిచాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దండవత్ యాత్ర అంటే సాష్టాంగ నమస్కారాలు లేదా పొర్లి దండాలు పెట్టుకుంటూ ఆలయానికి చేరుకుంటారు.
అతను దారిపోడవునా అలా సాష్టంగ పడుతూ రావడం పలువురిని ఆకర్షించడమే కాకుండా..ఇంత కఠినమైన మొక్కు మొక్కుకున్నాడా అని విస్తుపోయారు. ఎలాగైతేనేం జోగేష్ అలా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ సాయంత్రానికి ఆలయానికి చేరుకున్నాడు. ఆ క్రమంలో మోకాళ్లకు గాయలై రక్తమోడినా..తన మొక్కుని మాత్రం దిగ్విజయంగా పూర్తి చేశాడు. అంతేగాదు కనీసం పచ్చి మంచినీళ్లైన తీసుకోకుండా ఇలా చేయడం విశేషం.
పైగా తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని అంటున్నాడు. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఇంత కష్టపడినా బాగుండునేమో అని పలువురు భావించినా..ఆ బంధంలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది కదా ఆ సాధకబాధలు అని నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
At a time when divorce parties are emerging as a new hot invite, a 25-year-old man from Basti celebrated the personal milestone with a unique thanksgiving for the local deity.
Making the most of the auspicious occasion of Navratri, the newly-divorced man undertook a 9-km… pic.twitter.com/SZlQqvRMyn— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026
(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)


