ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఇన్‌స్టంట్స్‌’ కొత్త ఫీచర్‌ మీకోసం! | Instagram Launches Instants Feature For Temporary Photo Sharing, Users Can Also Create Music Enabled Carousels | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఇన్‌స్టంట్స్‌’ కొత్త ఫీచర్‌ మీకోసం!

May 29 2026 10:17 AM | Updated on May 29 2026 11:40 AM

Instagram's New Instants Feature New AI Generation

కొత్తగా... ఇన్‌స్టంట్స్‌!

ఫొటో–షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఇన్‌స్టంట్స్‌’ అనే కొత్త ఫీచర్‌ని ప్రారంభించింది. ‘ఆ క్షణంలో  తీసిన ఫొటోలను, ఫిల్టర్‌ చేయని, సహజమైన ఫొటోల రూపంలో స్నేహితులతో షేర్‌ చేసుకోవడానికి కొత్త మార్గం’ అని ‘ఇన్‌స్టంట్స్‌’ గురించి అభివర్ణించింది ఇన్‌స్టాగ్రామ్‌. యాప్‌ ఇన్‌బాక్స్‌ ద్వారా నేరుగా తాత్కాలిక ఫొటోలను పంపడానికి యూజర్‌లను ఈ ఫీచర్‌ అనుమతిస్తుంది.

సాధారణ, రోజువారీ ఫొటోలు మీ స్నేహితులు చూడడానికి ఇది ఒక కొత్త మార్గం. వారు చూసిన తరువాత ఫొటోలు మాయమైపోతాయి. ఇన్‌స్టంట్స్‌ మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ బాటమ్‌ రైట్‌ కార్నర్‌లో ఉంటుంది. కెమెరాపై టాప్‌ చేయడం ద్వారా ఫ్రెండ్స్, మ్యూచువల్స్‌ (మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్‌) ఫొటోలను షేర్‌ చేసుకోవచ్చు. ‘ఇన్‌స్టంట్స్‌’ని నచ్చిన వారితో పాటు నచ్చనివారు కూడా ఉన్నారు.
నచ్చకపోతే... ‘ఇన్‌స్టంట్స్‌’ను టర్న్‌ ఆఫ్‌ చేయడానికి...

  • ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి మీ ప్రొఫైల్స్‌లోకి వెళ్లాలి.

  • టాప్‌ రైట్‌ కార్నర్‌లోని 3 లైన్స్‌పై క్లిక్‌ చేసి ‘సెట్టింగ్స్‌’ ఓపెన్‌ చేయాలి.

  • కంటెంట్‌ ప్రిఫరెన్సెస్‌–స్క్రోల్‌ డౌన్‌

  • ‘హైడ్‌ ఇన్‌స్టంట్స్‌ ఇన్‌ ఇన్‌బాక్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.

  • ‘హైడ్‌ ఇన్‌స్టంట్స్‌ ఇన్‌ బాక్స్‌’ టర్న్‌ ఆఫ్‌ చేయడం ద్వారా ఇన్‌బాక్స్‌ నుంచి ఇన్‌స్టంట్స్‌ తొలగించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ క్యారెసెల్‌..
ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కొత్త ఫీచర్‌ని తీసుకువచ్చింది. దీని ద్వారా క్యారెసెల్స్‌ క్రియేట్‌ చేయవచ్చు. వాటికి మ్యూజిక్‌ యాడ్‌ చేయవచ్చు. ఇమేజ్‌ ఎడిట్‌ చేయవచ్చు.  ఒక్కముక్కలో చె΄్పాలంటే ఈ కొత్త ఫీచర్‌ ‘ఫీడ్‌’ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది.
ఎలా చేయాలంటే...

  • ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌ లెఫ్ట్‌ కార్నర్‌లోని ‘ప్లస్‌’ ఐకాన్‌ క్లిక్‌ చేయాలి.

  • ‘పోస్ట్‌’పై క్లిక్‌ చేయాలి.

  • మినిమమ్‌ రెండు పిక్చర్‌లను సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • క్లిక్‌ నెక్స్‌›్ట

  • మల్టిపుల్‌  ఎడిటింగ్‌ టూల్స్‌ కనిపిస్తాయి.

  • మీ చిత్రాలు నిలువుగా (పోర్ట్రెయిట్‌) చతురస్రాకారంలో ఉండడానికి అవసరమైన టూల్స్‌ ఎంచుకోవచ్చు.  ఫొటోలను ఓవర్‌లే చేయవచ్చు. టెక్ట్స్, మ్యూజిక్‌ జోడించవచ్చు.  ఎడిటింగ్‌ పూర్తయ్యాక... ‘నెక్ట్స్‌’పై క్లిక్‌ చేసి ఫొటోలను పోస్ట్‌ చేయడానికి ‘షేర్‌’పై క్లిక్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement