ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు.

వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్‌లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం...


