రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్‌ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..

Health: Blood Clot Causes Foods That Purify Blood By Ayurvedic Expert - Sakshi

శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కడుతోందా? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? సాధారణంగా రక్తం మూడు విధాలుగా గడ్డ కడుతుంది.
1. సిరలలో... అది ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. కాలికి వాపు రావడంతో పాటు నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు చర్మం రంగు మారుతుంది.

2. ఊపిరితిత్తులలో కొన్ని సార్లు గడ్డ కడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాళ్ళలో నుంచి రక్తప్రవాహంలో సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఆయాసం, ఛాతీ నొప్పి ముఖ్య లక్షణాలు. 

3. గుండె లో కూడా గడ్డ కడుతుంది. కొన్నిసార్లు ధమనుల ద్వారా మెదడుకు వెళ్లి పక్షవాతం రావచ్చు. D-dimer అనే రక్త పరీక్ష వలన సిరలలో ఉండే రక్త గడ్డ ను కొనుక్కో వచ్చు. గుండెలో ఉన్న రక్త గడ్డను Echocardiogramతో కనుక్కో వచ్చు. ఊపిరితిత్తుల రక్త గడ్డ ను ఛాతీ CT scanతో తెలుసుకోవచ్చు.

రక్తం మన శరీరంలో చేసే కీలకమైన పనులేంటీ? 
1. ఆక్సిజన్‌ను సరఫరాచేసేది రక్తమే
మనం బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని తెలుసు. అయితే, ఆ ఆక్సిజన్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. శరీరమంతా వ్యాపిస్తుంది. మరి గాలి రూపంలో ఉండే ఆక్సిజన్ శరీరానికి ఎలా అందుతుందనేగా మీ అనుమానం?

ఆ ఆక్సిజన్‌ను సరఫరా చేసేది వాహకం రక్తమే. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన పోషకాలు, హార్మోన్లకు సైతం సరఫరా చేస్తుంది. అయితే, మనం తినే ఆహారం, మన అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ప్రవాహానికి కూడా ఎలా ఆటంకాలు ఉండవు. 

2. రోజూ వ్యాయామం చేయాలి 
వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్ చేయడానికి సమయం లేనట్లయితే.. ఇంట్లో యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే.. రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది.

3. చక్కగా నిద్రపోండి
నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్‌లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రతీ రోజూ తప్పనిసరిగా కంటి నిండా నిద్రపోండి.

4. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగండి లేదా తినండి
బీట్‌రూట్‌లో శరీరానికి మేలు చేసే ఫైబర్, ఫొలేట్, విటమిన్‌ ఆ9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్‌ఇ ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. బీట్‌రూట్‌ను ఆహారంగా గానీ, జ్యూస్‌గా గానీ తీసుకోవచ్చు.

5. నీళ్లు ఎక్కువగా తాగండి
శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు (టాక్సిన్) ఉంటాయి. అవన్నీ బయటకు పోవాలంటే తప్పకుండా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే చాలు శరీరం టాక్సిన్‌లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది.

6. తులసి ఆకులు
తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్‌-కె  , ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి.

7. పసుపు తప్పనిసరి
భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. అందుకే, మీరు తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి.

8. ఆకుకూరలు ఎక్కువగా తినండి
పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

9. నిమ్మరసం మంచిది
కాలేయంలోని టాక్సిన్లను తొలగించాలంటే నిమ్మరసం తాగాల్సిందే. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

10. ఉసిరి తినండి
ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికులు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటో న్యూట్రియంట్లు, విటమిన్‌ ఈ, సీ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది.

11. అల్లం వెల్లులి మంచిది
మన వంటకాల్లో అల్లం వెల్లులి ప్రాధాన్యం తెలిసిందే. ఇవి నోటికి రుచే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెల్లులిలో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటాయి.

వెల్లులి రక్తపోటును అదుపులోకి ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ C, B3, B6, మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది.

12. బ్లాక్‌ కాఫీ తాగండి
రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్‌లు కూడా శరీరానికి అందుతాయి.

13. ఇవి కూడా మంచివే
రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి. ఒమెగా 3 ఎక్కువగా ఉండే సోయాబీన్, చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌ను తప్పకుండా తీసుకోండి.
-డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు

చదవండి: 37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే!
Suman Kalyanpur Facts: సుమన్‌ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top