విటమిన్‌ ‘ఏ’ లోపిస్తే ...అంత ప్రమాదమా..! | Sakshi
Sakshi News home page

విటమిన్‌ ‘ఏ’ లోపిస్తే ....అంత ప్రమాదమా..!

Published Wed, Mar 13 2024 4:19 PM

Health Benefits effects of Vitamin A check these details - Sakshi

ఆరోగ్యంగా జీవించాలంటే విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. శరీరంలోని అనేక ప్రక్రియలకు విటమిన్ ‘ఏ’  చాలా అవసరం. రెటినోల్, రెటీనా  రెటినోయిక్ యాసిడ్ సమ్మేళనం ఈ విటమిన్‌.  అందుకే దీన్ని  రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. మాంసం, చికెన్, చేపలు , పాలు, ఇతర మాంసాహారంలో ఇది లభిస్తుంది.  ఏ విటమిన్‌ తో వచ్చే లాభాలు, లోపిస్తే నష్టాలు గురించి తెలుసుకుందాం. 

కెరోటినాయిడ్స్, ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్ , బీటా-క్రిప్టోక్సంతిన్ విటమిన్  ఏలో పుష్కలంగా ఉన్నాయి.   రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి,  చక్కటి దృష్టికి ఇవి  చాలా  కీలకం  అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం  ఏ మిటమిన్‌ లోపిస్తే  శరీర పనితీరు  దెబ్బతినడమే కాదు,  అంధత్వం నుండి వంధ్యత్వం వరకు చాలా   సమస్యలు పొంచి ఉన్నాయి. 

ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని  కూడా నిపుణులు చెబుతున్నారు. 

విటమిన్ ‘ఎ’ లోపిస్తే 
మొటిమలు
పొడి చర్మం, కళ్ళు  పొడిబారడం
వంధ్యత్వం, గర్భ ధారణలో సమస్యలు
గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు
లాభాలు
రేచీకటి,   వయసు సంబంధిత సమస్యలనుంచి రక్షిస్తుంది.
కొన్ని రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. 
మొటిమలు, నల్లటి మచ్చలు   రాకుండా చూస్తుంది.
ప్రోటీన్, కాల్షియం,  విటమిన్ డీతో పాటు, ఎముకల పెరుగుదలకు విటమిన్‌ ఏ కూడా చాలా అవసరం. 
ఎముకల బలానికి విటమిన్‌ఏ కూడా చాలా అవసరం.

నోట్‌: విటమిన్‌ ఏ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదం.  విటమిన్‌  ఏ ఎక్కువైతే హైపర్‌ విటమినోసిస్ A కి దారి తీస్తుంది.  సప్లిమెంట్లతో పోలిస్తే విటమిన్ ఏ సహజంగా  లభించే ఆహారాలు  (పాలు,గుడ్డు, కేరట్‌, చేపలు లాంటివి) మేలు.  ఏదైనా వైద్యుల పర్యవేక్షణ అవసరం.


 

Advertisement
 
Advertisement