పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం | Gen Alpha Trapped In A Blurred Digital World, Study Flags Rising Influence Of Ads And Algorithms | Sakshi
Sakshi News home page

పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం

Mar 25 2026 12:03 PM | Updated on Mar 25 2026 12:25 PM

gen alpha digital lifestyle content impact online offline blur

ప్రకటనలు, వినోదం మేళవింపులో పిల్లల మనుగడ 

పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం 

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండూ ఒకే ప్రపంచం అనే భావన 

ఫోన్‌ ఒక పరికరం కాదు, వారు జీవించే చోటని ఊహ

ఏఎస్‌సీఐ ‘వాట్‌ ది సిగ్మా?’ అధ్యయనంలో వెల్లడి

జెన్‌ ఆల్ఫాకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్‌ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్‌ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్‌ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్‌ప్లే, యాడ్స్‌తో పెద్దల కంటెంట్‌ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. 

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచం 
చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్దలకు తమ పిల్లలపై ఉన్న అవగాహనను తుడిచిపెడుతోంది. వినోదానికీ, వాణిజ్యానికీ తేడా తెలియని జెన్‌ ఆల్ఫా తరం ఓ విష వలయంలో చిక్కుకుంటోంది. ఈ విషయాన్ని ఫ్యూచర్‌ బ్రాండ్స్‌ కన్సల్టింగ్‌తో కలిసి, అడ్వరై్టజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) అకాడమీ  ‘వాట్‌ ది సిగ్మా?’ అనే ఎథ్నోగ్రాఫిక్‌ 
పరిశోధన తేలి్చంది. ఈ పరిశోధన హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో జరిగింది.  

వ్లాగ్స్, షార్ట్స్, గేమ్‌ప్లేలోని స్పాన్సర్డ్‌ 
కంటెంట్‌లో జెన్‌ ఆల్ఫా తరం చిక్కుకుంటోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అనేవి రెండు వేర్వేరు ప్రపంచాలు కావు.. రెండూ ఒక్కటే అనే భావనకు విపరీతంగా గురవుతున్నారు. మరి వీరిపై వాణిజ్యపరమైన ప్రభావం ఏమిటి? 7నుంచి 15 ఏళ్ల వయసు (జనరేషన్‌ ఆల్ఫాకు 
చెందిన) పిల్లలు మీడియా, కంటెంట్‌తో ఎలా ఇంటరాక్ట్‌ అవుతున్నారు? హైపర్‌–డిజిటల్‌ వాతావరణంలో వాణిజ్య సందేశాలను ఎలా గుర్తిస్తారు? ఎలా వర్గీకరిస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? వంటి విషయాలను అధ్యయనంలో పరిశీలించారు.  

పిల్లల అంతర్జాలం.. పెద్దల్లో గందరగోళం.. 
జెన్‌ ఆల్ఫా తరం ఇంటర్నెట్‌తో పాటు వృద్ధి చెందకుండా.. ఇంటర్నెట్‌లో ఇరుక్కుపోతున్నారు. వారి సాంస్కృతిక సంకేతాలు, సౌందర్య భావనలు, భాషా ప్రపంచం నెమ్మదిగా వేరవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సమకాలీనమైన ఈ తరానికి సంబంధించిన ప్రస్తావనలు అపరిచితంగా ఉంటాయి. హాస్యం అస్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, వారికి ఆట స్థలంలో ఆటలాగా తక్షణమే, అందరితో పంచుకోవాల్సిన అంశాలుగా మారుతున్నాయి. పిల్లల డిజిటల్‌ ప్రపంచం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కోల్పోతున్న పరిస్థితుల్లో.. వీక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఫీడ్‌తో బిజినెస్‌ అల్గారిథం రంగంలోకి దిగింది. ఈ పరిణామం ఎంత వేగంగా జరుగుతోందంటే, పెద్దలను వారి పిల్లల ప్రపంచంలో నిరక్షరాస్యులుగా మార్చేస్తోంది. తాము పూర్తిగా చూడలేని వారి ప్రపంచంలో హానికరమైన కంటెంట్‌ అంటే ఏమిటో తెలియక, స్క్రీన్‌ సమయం, డిజిటల్‌ వినియోగంపై నియమాలను నిర్దేశిస్తూ, అమలుపై స్పష్టత లేని స్థితిలో తల్లిదండ్రులు  నిరంతరం నియమాలను సవరించుకుంటున్నారు.

వినోదం రూపంలో ప్రమాదం.. 
చిన్న పిల్లలు (7–12 మధ్య వయసు్కలు) అత్యంత స్పష్టమైన ప్రకటనలను మాత్రమే గుర్తిస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రమోషన్లు, గేమింగ్‌ అనుసంధానాలు, వ్లాగ్‌ స్పాన్సర్‌íÙప్‌లు వీరికి కేవలం వినోదంగానే అనిపిస్తాయి. పెద్ద పిల్లలు (13–15 మధ్య వయస్కులు) ప్రకటనల అక్షరాస్యతను ఎక్కువగా పెంపొందించుకున్నా.. భావోద్వేగాలతో కూడిన, కథనంతో మిళితమైన బ్రాండ్‌ సందేశాలకు సులభంగా ప్రభావితమవుతుంటారు. నిరంతరాయంగా ప్రసారమయ్యే మీడియా ప్రవాహంలో మునిగిపోవడంతో వీరిలో విచక్షణా శక్తి తగ్గిపోతోంది.

డిజిటల్‌ సొసైటీ దిశగా.. 
జెన్‌ ఆల్ఫాకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్‌ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్‌ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. 

ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్‌ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్‌ప్లే, యాడ్స్‌తో పెద్దల కంటెంట్‌ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.

క్రమబదీ్ధకరణకు ఓ వ్యవస్థ అవసరం.. 
ఈ నేపథ్యంలో జెన్‌ ఆల్ఫాకు మార్కెటింగ్‌ విషయంలో బాధ్యతాయుతమైన విధానాన్ని నిర్ధారించడానికి, ప్లాట్‌ఫామ్‌లు, కంటెంట్‌ క్రియేటర్లు, ప్రకటనదారులు, తల్లిదండ్రులు, పాఠశాలల సమన్వయంతో ఓ నిరీ్ణత వ్యవస్థ అవసరమని అధ్యయనకర్త అభిప్రాయం. పాఠశాలల్లో మీడియా, ప్రకటనల అక్షరాస్యత వాణిజ్య విద్య ద్వారా వాణిజ్య ఉద్దేశంపై అవగాహన పెంపొందించడం అవసరమని స్పష్టం చేసింది.

అధ్యయనకర్తలు ఏమంటారంటే.. 
‘ఏఎస్‌సీఐ అకాడమీ’ వాట్‌ ది సిగ్మా?’ అధ్యయనం, జనరేషన్‌ ఆల్ఫా కంటెంట్‌ జీవితంపై జరిపిన ఒక పరిశోధన. ఇది వారిని విమర్శించడానికి కాదు, వారిని అర్థం చేసుకోవడానికి. వారి సాంస్కృతిక దృక్పథాలు, మునుపటి తరాల వారి దృక్పథాల నుంచి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీరే అతి పిన్న వయసు్కలైన మీడియా వినియోగదారులు కాబట్టి, వారు ప్రకటనలను ఎలా తీసుకుంటారు? అనే దానిపై అవగాహన పొందడం.. బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడంలో మొదటి అడుగు.’ అని ఏఎస్‌సీఐ సీఈఓ, సెక్రటరీ జనరల్‌ మనీషా కపూర్‌ అంటున్నారు. 

‘గత తరానికి డిజిటల్‌ మీడియా 
పరిచయం కాగా, ఈ తరానికి అదే ప్రపంచం. వీరికి కంటెంట్‌తో సంబంధం ఉంది, దీనిని తల్లిదండ్రులు, విశ్లేషకులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నివేదిక వారు ఏమి చూస్తున్నారో మాత్రమే కాకుండా, అల్గారిథమ్, కంటెంట్, ప్రకటనల ద్వారా వారు ఎలా ప్రభావితమవుతున్నారో అన్వేíÙంచింది. ప్రకటనల వాతావరణంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? అనే ప్రయత్నాలకు ఆలంబనగా.. ఇది జెన్‌ ఆల్ఫా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కలి్పంచడానికి ప్రయత్నించింది’ అని ఫ్యూచర్‌ 
బ్రాండ్స్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ సంతోష్‌ దేశాయ్‌ చెబుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement