రెండేళ్లుగా వ్యాన్‌లోనే బందీ..! పాపం చివరికి.. | French man charged with locking son in van for more than A Year | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా వ్యాన్‌లోనే బందీ..! పాపం చివరికి..

Apr 12 2026 3:21 PM | Updated on Apr 12 2026 4:11 PM

French man charged with locking son in van for more than A Year

కొన్ని ఘటనలు ఎంత అమానుషంగా ఉంటాయంటే మనిషన్నవాడే కనుమరుగైపోతున్నట్లుగా ఉంటుంది. కన్నతండ్రే ఘోరంగా ప్రవర్తించడం చూస్తుంటే..చిన్నచిన్న జంతువులే తమ పిల్లలను కంటికిరెప్పలా కాచుకుంటాయే మరి విచక్షణ జ్ఞానం ఉన్న మనకేమవుతోందో అర్థమవడం లేదు. స్వలాభం, స్వప్రయోజనం ఇంతేనా జీవితం. ఒక మనిషిని బాధపెడితేనే మనం సుఖంగా ఉంటాం. ఈ ప్రకృతి నినాదం జంతువులు అర్థ చేసుక్నుట్లు స్వార్థపూరిత మనుషులకు అర్థం కాదేమో కాబోలు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే పాపం ఆ పసివాడికి కన్నతండ్రే దారుణంగా విధించిన శిక్ష తెలిస్తే..ఏ మనిషివిరా నువ్వు అన్నంత కోపం కట్టలు తెంచుకుంటుంది. 

అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌లోని హాగెన్‌బాచ్ గ్రామంలో, నవంబర్ 2024 నుంచి తొమ్మిదేళ్ల బాలుడు యుటిలిటీ వ్యాన్‌లో బంధించబడ్డాడు. ఆ సమీపంలోనొ ఒక వ్యక్తి ఆ వ్యాన్‌ నుంచి బాలుడి అరుపుల్లా వినిపిస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి రాగానే అక్కడే నిరుపయోగంలోని ఓ వ్యాన్‌ కనిపించింది. అందులో బాలుడి అరుపులేంటి అన్నట్లుగా నమ్మశక్యంగా చూశారు. 

చివరకి ఆ వ్యాన్‌ చుట్టూ ఉన్న చెత్తను తొలగించి బలవంతంగా డోర్‌ తెరవగా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్కడ ఆ బాలుడు నగ్నంగా తీవ్ర పోషకాహార లోపంతో కనపించాడు. అలా కూర్చొనే ఉండటంతో నడవలేని స్థితికి వచ్చేసి ఉన్న పసివాడిని చూసి పోలీసులే దిగ్బ్రాంతి చెందారు. కదలికలు లేకుండా అన్నేళ్లు అలా నిర్బందించి ఉండటం వల్ల అతడిలో కలికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ వ్యాను స్విట్జర్లాండ్‌, జర్మనీ సరిహద్దులకు సమీపంలో హాగెన్‌బాక్‌లో ఉంది. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా..భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రే దీనంతటికి కారణమని తేలింది. ఏడేళ్ల వయసున్న బాలుడిని తన భార్య మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చించాలి ఫోర్స్‌ చేసిందని, గత్యంతరం లేక ఇలా వ్యాన్‌లో దాచినట్లుగా తండ్రి చెప్పాడు. తీరా అతడి భార్యను విచారిస్తే..తనకసలు ఆ బాలుడి గురించి ఏమి తెలియదని బుకాయించింది. అనుమానంతో పోలీసులు ఆ దపంతులపై పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఆ బాలుడికి 12 ఏళ్ల సోదరి కూడా ఉందని తెలిసింది. అంతేగాదు స్కూల్‌లో మంచిప్రతిభ కనబర్చేవాడని, అలాగే అతడికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని వెల్లడించారు పోలీసులు

ఆమెను కూడా రెండేళ్లక్రితం అంటే పదేళ్ల వయసులో సామాజిక సేవల సంరక్షణలో ఉంచినట్లు వెల్లడైంది. అయితే ఆ బాలుడు విచారణలో తన తండ్రి తన భార్యతో సమస్యలున్నాయని, అందువల్ల తానిలా బంధింపబడక తప్పలేదని చెప్పుకొచ్చాడు. అతడికి తండ్రే స్వయంగా రెండుసార్లు ఆహారం, వాటిర్‌ బాటిల్స్‌ విండో గుండా విసిరేవాడని చెప్పుకొచ్చాడు. ఆ బాలుడు వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్‌లలోనే మలమూత్రాదులు వెళ్లేవాడినని చెబుతుంటే..మరి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయారు పోలీసులు. 

2024లో చేసిన చివరి స్నానం..ఇక అక్కడ నుచి అలానే వ్యాన్‌లో మగ్గిపోయాడు ఆ పసివాడు. దీంతో పోలీసులు ఆ బాలుడి తండ్రిపై అపహరణ, మైనర్‌ సంరక్షణలో విఫలమవ్వడం తదిరత కేసులన్నిటిని నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేగాదు ఇందుకు సహకరించిన ఆమె భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఆ పసివాడికి ఇది జీవితాంత ఓ పీడకలలా వెంటాడుతుంది. అంతతొందరగా బయటపడి..అందరి పిల్లల్లా హాయిగా జీవితాన్ని గపడానికి చాలా ఏళ్లే పట్టొచ్చు. 

(చదవండి: స్లాబ్‌లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement