
Electronic Anti Snoring Device: ప్రపంచంలోనే విచిత్రమైన ఆరోగ్య సమస్య గురక. ఆ శబ్దంతో ఇంటిల్లిపాదీ జాగారం చేస్తున్నా గురక పెట్టే వారు మాత్రం హాయిగా ‘సౌండ్’ స్లీప్‌లో తరిస్తుంటారు. మరి ఆ డిస్టర్బెన్స్‌కు చెక్ పెట్టేదే.. ఈ మినీ గాడ్జెట్ (ఎలక్ట్రానిక్ యాంటీ స్నోరింగ్ డివైజ్). గురక సమస్య ఉన్న వారు నిద్రపోయేప్పుడు దీన్ని ముక్కురంధ్రాలకు పెట్టుకుంటే.. స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపించడంతో పాటు.. శ్వాసకూ ఇబ్బందిపడకుండా చేస్తుంది.
దాంతో శబ్దం లేకుండా నిద్రపోతారు. ఈ పరికరంలోని యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్.. హానికరమైన వాయువులను, దుమ్ము, ధూళిని సమర్థవంతంగా అరికట్టి, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఇలాంటి మెషిన్స్ బ్యాటరీలతో నడిచేవి, చార్జింగ్ పెట్టుకునేవి రెండూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. కానీ చార్జింగ్ పెట్టుకునే మెషిన్ అయితే మన్నిక బాగుంటుంది. కొనే ముందు క్వాలిటీ, రివ్యూస్ చూసి కొనుగోలు చేయడం మంచిది. మోడల్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
-ధర: 9 డాలర్లు (రూ.672)
చదవండి: Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే!