సముద్రంలో నివసించే ఈ జీవిపేరు వాంపైర్. అంటే రక్తం తాగే దెయ్యం అని అర్థం. దీని పేరు వినడానికి కాస్త భయంగా ఉన్నా, ఇది చాలా చిన్నది, సాధుజీవి.
ఈ స్క్విడ్ చూడటానికి ఎరుపు రంగులో, దాని చేతుల మధ్య ఉండే చర్మం నల్లటి ముసుగులా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది సముద్రంలో చాలా లోతుగా, సూర్యరశ్మి అస్సలు పడని చీకటి ప్రదేశంలో బతుకుతుంది. అక్కడ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన శరీరం నుంచి నీలి రంగు వెలుతురును విడుదల చేస్తుంది.
ఆ వెలుతురు చూసి వేరే పెద్ద చేపలు భయపడి ΄ారి΄ోతాయి. మిగతా స్క్విడ్‌లు చిన్న చిన్న చేపలను వేటాడి తింటాయి. కానీ మన వాంపైర్ స్క్విడ్ మాత్రం వేటాడదు. సముద్రం పైభాగం నుంచి కిందికి కొట్టుకు΄ోయే చని΄ోయిన చిన్న జీవుల ముక్కలు, మురికి వంటి వాటిని తింటుంది. అంటే ఇది సముద్రాన్ని శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ అన్నమాట! నిర్వహణ : రమాదేవి జంబుల


