Women Power: పక్కా పల్లెటూరులో... ఫైవ్‌స్టార్‌ లైబ్రరీ! | Village In Bihar Builds Five-Star Library Worth ₹15 Lakh To Empower Students And Readers, Read Success Story Inside | Sakshi
Sakshi News home page

Women Power: పక్కా పల్లెటూరులో... ఫైవ్‌స్టార్‌ లైబ్రరీ!

May 29 2026 10:28 AM | Updated on May 29 2026 11:29 AM

Dabil's Five Star Library Success Story In Rural Areas

సమ్‌థింగ్‌ స్పెషల్‌

విమెన్‌ పవర్‌

బిహార్‌లోని జమయి జిల్లాలోని దబిల్‌ గ్రామంలో.... దినపత్రికలు, పుస్తకాలు చదువుకునేవారు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు పట్టణంలోని లైబ్రరీలు తప్ప ఇతరత్రా సదుపాయాలు ఉండేవి కాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది సర్పంచ్‌ దబిల్‌.

‘మన ఊరికి మంచి లైబ్రరీ ఉండాలి. అది మన పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని గ్రామ ప్రజలను ఒప్పించింది దబిల్‌. ఇప్పుడు ఈ గ్రంథాలయం వందలాది మంది విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఈ లైబ్రరీకి రెగ్యులర్‌గా వస్తుంటారు.

విద్యార్థులకు సహాయం చేయడానికి ఈ లైబ్రరీలో ఇద్దరు ఉద్యోగులను నియమించారు. ఎయిర్‌ కండిషన్డ్‌ గదులతో పాటు భద్రతా పర్యవేక్షణ కోసం సీసీ టీవి కెమెరాలు అమర్చారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించకుండా, ప్రభుత్వ ఫండ్స్‌ కోసం ఎదురుచూడకుండా గ్రామస్థులే పదిహేను లక్షల ఖర్చుతో ఈ ఫైవ్‌–స్టార్‌ లైబ్రరీని నిర్మించుకోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement