Beauty: కొబ్బరి పాలతో స్క్రబ్‌.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..

Coconut Milk Amla Lemon Orange Natural Tips For Glowing Skin - Sakshi

చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి.
కొబ్బరి పాలతో..

►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
►ఇలా యాంటీ ఏజింగ్‌ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ
తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్‌ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్‌ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అందువల్ల విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు.

అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది.   

చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్‌! ధర ఎంతంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top