బోన్‌ చర్చ్‌.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం

Church Of Bones In Czech Republic - Sakshi

భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్‌ దేశాల్లో ఒకటైన చెక్‌ రిపబ్లిక్‌లో కుట్నా హోరాలోని  సెడ్లెక్‌లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్‌ ఓస్యూరీ రోమన్‌ క్యాథలిక్‌ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 

1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్‌ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్‌ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు..  చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది.

14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్‌ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో..  అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్‌ చర్చ్‌’ అనే పేరు కూడా వచ్చింది. 
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top