ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా! | Boiling Lake At Morne Trois Pitons National Park | Sakshi
Sakshi News home page

ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా!

Jul 2 2023 10:57 AM | Updated on Jul 2 2023 1:18 PM

Boiling Lake At Morne Trois Pitons National Park  - Sakshi

ప్రపంచంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలు ఉంటాయి. వేడినీటి బుగ్గల్లోని నీళ్లు సాధారణంగా స్నానానికి అనువుగా ఉంటాయి. డోమనికా రాజధాని రోసోకు చేరువలోని మోర్నె ట్రాయిస్‌ పిటోన్స్‌ నేషనల్‌ పార్కులో ఏకంగా మరుగునీటి సరోవరం ఉంది.

దీనిని తొలిసారిగా 1870లో ఇద్దరు బ్రిటిష్‌ వ్యక్తులు గుర్తించారు. ఈ సరోవరంలోని నీటి ఉష్ణోగ్రత 82 డిగ్రీల నుంచి 92 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటుంది. ఇందులోని నీరు నిత్యం సలసల మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. డోమనికా వచ్చే విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సరోవరం చూడటానికి వస్తుంటారు. దీని ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుంటారు. 

(చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement