డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్‌: బెంగళూరు టెకీ జంట | Bengaluru techie couple unusual dilemma of having enough money but don't know how to spend | Sakshi
Sakshi News home page

డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్‌: బెంగళూరు టెకీ జంట

Published Wed, Jun 19 2024 3:00 PM | Last Updated on Wed, Jun 19 2024 3:20 PM

ప్రతీకాత్మక చిత్రం

పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని,  ఆపదలో ఉన్నాం  ఆదుకోమని అడగడం చాలా కామన్‌.  కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు  చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా?  సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి!
 

బెంగళూరు టెకీ జంట  నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.  బెంగళూరులో  ఇల్లు, ఖరీదైన కారు,  సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.

భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్‌’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో  నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు  నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు.  ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు.  అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్‌ పెట్టారు.

దీంతో యూజర్లు  కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు.  పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్‌ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు.  దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు  కమెంట్‌ చేశారు.  మరి మీరేమంటారు.. కామెంట్‌ సెక్షన్‌లో తెలపండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement