అందమైన వారిని చూస్తే అసూయ, ఒత్తిడి... ఏం చేయాలి? | Beauty and confidence check what Psychologists suggest | Sakshi
Sakshi News home page

అందమైన వారిని చూస్తే అసూయ, ఒత్తిడి... ఏం చేయాలి?

Oct 28 2025 2:48 PM | Updated on Oct 28 2025 3:15 PM

Beauty and confidence check what Psychologists suggest

అందంగా లేమని ఆత్మన్యూనతా భావం 

అందంగా లేనా..అసలేం బాలేనా?

అందం కోసం అనవసరమైన ఆరాటం 

'అందం'.. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే పదం. అం దంగా ఉన్నవాళ్లను చూస్తే ఆకర్షణ.. తాము అందంగా ఉన్నామా లేమా అని ప్రతిసారీ అను కోవడం సర్వసాధారణం. కానీ, కొందరు -మాత్రం ఆత్మన్యూనత, ఆందోళనలకు గురవు తున్నారు. ఫలితంగా ఇటీవలి కాలంలో.. బాడీ షేమింగ్, అందంపై చేసే వ్యాఖ్యలు చాలామం దిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. 'అందం బాహ్యవస్తువు కాదు. అంతఃసౌందర్యమే నిజమైన అందం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. ఆ వాస్తవాన్ని గుర్తించి, మనల్ని మనం ప్రేమించగలిగితే ఏ సమస్యా ఉండదు' అంటున్నారు మానసిక నిపుణులు.


చాలామందికి ఆత్మ విశ్వాసం.. అందంతో ముడిపడి ఉంటుంది. అందమైన అమ్మాయి లేదా అబ్బాయి కని పిండగానే ఒకసారి జుట్టు సర్దుకుం టారు. ముఖంపైకి చేతులు వెళ్తాయి. ఆఫీసులు, బజారు, సినిమా థియే టర్, పార్కు.. ప్రతిచోటా ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురవు తుంటాయి. తమకంటే అందమైన వాళ్లు కనిపించగానే కొందరికి ఆత్మ విశ్వాసం కాస్త దెబ్బతింటుంది. వాళ్ల ముందుకు పోవడానికి కూడా సందే హిస్తుంటారు.
 

ప్రకటనలూ మారిపోయాయి
ఇటీవలి కాలంలో అందానికి నిర్వచనం మారుతోంది. ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అంటూ ప్రకటనలు వచ్చేవి. తెల్లగా ఉండేవారే ప్రకటనల్లో కనిపించేవారు. కానీ ఇటీవలి కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రకటనలు.. రామనఛాయ, నల్లగా ఉండేవారి తోనూ చేస్తున్నారు. అందం అనేది అంతర్లీనంగా ఉండేది తప్ప.. బాహ్యంగా కనిపించేది కాదు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 'ఈ అందంపై ఆరాటాన్ని మర్చి పోయే ప్రయత్నం చేయాలని చాలామంది చెబుతుం టారు. కానీ, అది సరైంది కాదు. ఎందుకంటే.. వైవిధ్యం సృష్టి ప్రత్యేకత, మన చుట్టూ మనకంటే ' తెలివైనవారూ ఉంటారు.. తెలివి తక్కువవారూ ఉంటారు. అలాగే మనకంటే అందమైనవారూ ఉంటారు, అందంగా లేని వారూ ఉంటారు. దాన్ని మనం మార్చలేం. అందువల్ల.. వాస్త వాన్ని అంగీకరించడం ఉత్తమం' అంటున్నారు సైకాలజిస్టులు,

సంసారం సౌందర్యం
పెళ్లి చేసుకునేటప్పుడు చాలామంది సౌందర్యం అనే అంశం దగ్గర ఆగి పోతారు. నిజానికి దాంపత్య జీవితంలో మొదట్లో ప్రథమ ప్రాధాన్య తగా ఉండే అందం.. రానురాను వెనక్కు వెళ్లిపోతుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనస్తత్వం, సర్దుకుపోయే స్వభావం, సహనం, ప్రేమ... ఇవన్నీ ఒకదాన్నిదాటి ఒకటి పైపైకి వచ్చేస్తాయి.

సోషల్  మీడియా పాత్రా ఉంది 
2024లో అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురిత మీడియా మైన ఓ అధ్యయనం.. సోషల్ మీడియా కూడా అందంపై ఆరాటా నికి కారణమవుతోందని తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. వాట్సాప్ స్టేటస్ దగ్గరి నుంచి ఆయా సామాజిక మాధ్య మాల్లో పెట్టే ఫొటోలు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నా యని పేర్కొన్నారు. ఈ సమస్య ఆఖరికి భోజనపు అలవాట్లనూ ప్రభావితం చేస్తోందని తెలిపింది. సమాజంలో నలుగురితో స్వేచ్ఛగా కలవకుండా చేస్తోందని ప్రస్తావించింది.

మిమ్మల్ని మీరు ప్రేమించండి
కేవలం ముఖాన్నే కాదు.. శరీరం లోని ఇతర అవయవాలపైనా కామెంట్లు చేస్తుంటారు. అవిమనసుకు తీసుకుని చాలామంది బాధపడుతుంటారు. ఇది కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే.. ఆం దంగా ఉన్నామని చెప్పుకొనేవారి కైనా, అందంగా లేమని అనుకునే వారికైనా.. ఆ లక్షణాలేవీ తయా రుచేసుకున్నవి కావు. అందువల్ల శరీరాకృతిని చూసి బాధపడటం, బయటకు వెళ్లాలంటే భయప డటం సరైనది కాదు. నిజమైన సౌందర్యం అంటే.. తోటి వారిని ప్రేమించే గుణం, కారుణ్యం. సహనం. ఇవేవీ లేనప్పుడు ఎంత సౌందర్యం ఉన్నా వృథా.

-సాక్షి, స్పెషల్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement